Site icon Neti Telugu

ఉత్తరాంధ్ర దెబ్బకు ఫ్యాన్ రివర్స్..మంత్రులకు ఎసరు!

ఉత్తరాంధ్ర అంటే మొదట నుంచి టీడీపీ కంచుకోట..కానీ ఆ కంచుకోటని గత ఎన్నికల్లో వైసీపీ బద్దలుగొట్టింది. ఉత్తరాంధ్ర మూడు ఉమ్మడి జిల్లాల్లో వైసీపీ వన్ సైడ్ గా గెలిచింది. ఉత్తరాంధ్రలో 34 స్థానాలు ఉంటే వైసీపీ 28 సీట్లు గెలుచుకుంది. టి‌డి‌పికి 6 స్థానాలు మాత్రమే వచ్చాయి. ఇక టి‌డి‌పి గెలిచిన విశాఖ నగరంలో కూడా దెబ్బతీయడమే లక్ష్యంగా వైసీపీ రాజకీయం చేసింది.

ఇక టీడీపీకి చెక్ పెట్టి విశాఖ మున్సిపల్ కార్పొరేషన్‌ని వైసీపీ కైవసం చేసుకుంది. విశాఖ పరిపాలన రాజధాని పేరుతో వైసీపీ చేస్తున్న రాజకీయం ఏంటో అందరికీ తెలిసిందే. పేరుకు ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసమని చెబుతున్నారు గాని..రాజధాని పేరుతో వైసీపీ చేసే అక్రమాలు తెలిసిందే. అభివృద్ధి చేయాలంటే రాజధాని అక్కర్లేదు..ఎలాగైనా చేయవచ్చు. కానీ రాజకీయం కోసం రాజధాని కాన్సెప్ట్ తెచ్చారు. త్వరలోనే విశాఖ నుంచి పాలన మొదలుపెడతామని జగన్ చెబుతున్నారు.

ఈ పరిణామాల నేపథ్యంలో ఉత్తరాంధ్రలో వైసీ హవా కొనసాగుతుందని అంతా అనుకున్నారు. అక్కడ మంత్రులు సైతం ఎక్కడ ఆగలేదు. ఇంకా తమకు తిరుగులేదని భావిస్తున్నారు. కానీ వైసీపీకి, ఉత్తరాంధ్ర మంత్రులకు షాక్ ఇస్తూ పట్టభద్రుల తీర్పు ఇచ్చారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో టీడీపీ జోరు కొనసాగింది. ఊహించని విధంగా టి‌డి‌పి వన్ సైడ్ గా గెలిచేసింది. అక్కడ వైసీపీ పరిస్తితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.

టి‌డి‌పికి 45 శాతం ఓట్లు వరకు వస్తే ..వైసీపీకి కేవలం 27 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి..అంటే వైసీపీని ఏ స్థాయిలో ఓడించారో అర్ధం చేసుకోవచ్చు. ఈ ఓటమితో ఉత్తరాంధ్రలో మంత్రులు చిక్కుల్లో పడినట్లే. ఎవరికో ఎసరు వచ్చినట్లే. ఇప్పటికే ఇద్దరు, ముగ్గురు మంత్రులని తప్పిస్తానని జగన్ ఇప్పటికే వార్నింగ్ ఇచ్చారు. ఈ ఫలితాల నేపథ్యంలో ఉత్తరాంధ్ర మంత్రులకు షాక్ తప్పదు. 

Exit mobile version