టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాలతో పాటు వ్యక్తిగత జీవితానికి కూడా ఎంతో ఇంపార్టెన్స్ ఇస్తాడు. షూటింగ్ టైంలో ఏమాత్రం గ్యాప్ వచ్చిన భార్య లక్ష్మి ప్రణతి తో పాటు తన ఇద్దరు పిల్లలతో ఇంట్లో గడిపేస్తాడు. ఎన్టీఆర్ భార్య లక్ష్మీప్రణతి ఓ స్టార్ హీరోకు భార్యగా ఉన్నా లో ప్రొఫైల్ మెయింటెన్ చేస్తూ ఉంటారు. లక్ష్మీ ప్రణతి పెద్దగా బయటకు వచ్చేందుకు ఇష్టపడరు. ఆమె గురించి చాలా తక్కువ విషయాలు బయటకు వస్తాయి. చాలా మంది హీరోల భార్యలు సోషల్ మీడియాలోనూ.. బయట చాలా యాక్టివ్‌గా ఉంటారు. కానీ లక్ష్మీప్రణతి మాత్రం ఇలాంటి పబ్లిసిటీలకు దూరంగా ఉంటారు.
ఇక లక్ష్మీప్రణతి కాలేజీ రోజుల్లో టాలీవుడ్ మన్మధుడు నాగార్జున కు వీరాభిమాని అట. నాగార్జున నటించిన ఏ సినిమా రిలీజ్ అయినాన ఫస్ట్ డే కచ్చితంగా షో చూసే యాల్సిందే . నాగార్జున నటించిన మన్మధుడు – నేనున్నాను – మాస్ – డాన్ ఈ సినిమాలన్నీ కూడా లక్ష్మీప్రణతి ఫస్ట్ డే చూశారట. నాగార్జున సినిమాలు అంటే లక్ష్మీప్రణతి కి పిచ్చపిచ్చగా ఇష్టం. పెళ్లికి ముందు ఎన్టీఆర్ కంటే నాగార్జున సినిమాలే ఆమె ఎక్కువగా చూసేవారట. ఇక ఎన్టీఆర్ కూడా నాగార్జున ను బాబాయ్ బాబాయ్ అంటూ ఎంతో ఆప్యాయతతో ఉంటాడు.
మరో ట్విస్ట్ ఏంటంటే ఎన్టీఆర్ సోదరుడు నందమూరి కళ్యాణ్ రామ్ భార్య సైతం పెళ్ళికి ముందు…. ఇప్పుడు కూడా నాగార్జునకు వీరాభిమాని. ఈ విషయాన్ని కళ్యాణ్ రామ్ మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రాం లో స్వయంగా చెప్పారు. ఇలా నందమూరి తోడికోడళ్ళు ఇద్దరూ తమ భర్తలు హీరోలగా ఉన్నా పెళ్లికి ముందు నుంచే నాగార్జునకు అభిమానులు కావడం విశేషం.
Discussion about this post