వైసీపీ అధ్యక్షుడు, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిళల వైఖరిపై టీడీపీ శ్రేణులు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. అన్నాచెల్లెళ్లుగా ఉన్న జగన్, షర్మిళల మధ్య విభేదాలు వచ్చాయా? లేక విభేదాలు వచ్చినట్లు రాజకీయాలు చేస్తున్నారా అని డౌట్ పడుతున్నారు. ఎందుకంటే మొన్నటివరకు షర్మిళ…తన అన్న పార్టీ వైసీపీ కోసం గట్టిగానే కష్టపడ్డారు. పార్టీ పెట్టిన మొదట్లూ జగన్ జైలుకు వెళ్లారు.
అప్పుడు పాదయాత్ర చేసి వైసీపీని నిలబెట్టే ప్రయత్నం చేశారు. అప్పుడు జరిగిన ఉపఎన్నికల్లో వైసీపీని గెలిచిపించడం కోసం కష్టపడ్డారు.
అలాగే 2014లో పార్టీ కోసం ప్రచారం చేశారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో సైతం వైసీపీ గెలుపు కోసం షర్మిళ తిరిగారు. పార్టీ గెలిచి అధికారంలోకి వచ్చింది. దీంతో షర్మిళకు కీలక పదవి దక్కుతుందని ప్రచారం జరిగింది. కానీ అలాంటిదేమీ జరగలేదు. ఈ క్రమంలోనే షర్మిళ తెలంగాణ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి, అక్కడ పార్టీ పెట్టి, రాజన్న రాజ్యం తీసుకోస్తానని చెబుతున్నారు. కానీ షర్మిళ ఎక్కడా కూడా జగన్ ఊసు తీయడం లేదు. అలా అని జగన్ సైతం, ఆమె గురించి ప్రస్తావించడం లేదు. తాజాగా కూడా నీటి వివాదంలో రెండు రాష్ట్రాల సీఎంలు డ్రామాలు ఆడుతున్నారనే విధంగా షర్మిళ మాట్లాడారు.
ఇటు జగన్ కూడా పక్క రాష్ట్రాల రాజకీయాల్లో వేలు పెట్టనని అంటున్నారు. అటు వైఎస్సార్ జయంతి సందర్భంగా ఇడుపులపాయకు ఈ ఇద్దరు వేర్వేరు సమయాల్లో వెళ్లారు. దీని బట్టి చూస్తే వారికి విభేదాలు ఉన్నట్లే కనిపిస్తున్నాయి. కానీ రాజకీయంగా విభేదాలు ఉన్నట్లు నటిస్తున్నారని టీడీపీ శ్రేణులు అంటున్నాయి. వారు చేసే రాజకీయాలని చూస్తే అది అర్ధమైపోతుందని, విభేదాలు ఉంటే షర్మిళ ఏపీలోనే ఇంకో పార్టీ పెట్టొచ్చని చెబుతున్నారు. మొత్తానికైతే జగన్, షర్మిళలు ఎవరి పర్ఫామెన్స్ వాళ్ళు చేస్తున్నారని అంటున్నారు.
Discussion about this post