రాష్ట్రంలో ఏమైనా సమస్యలు ఉంటే…వాటిని ప్రతిపక్ష టిడిపి హైలైట్ చేసే ప్రయత్నం చేస్తుంది. ప్రతిసారి సమస్యలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడానికి కృషి చేస్తోంది. కానీ టిడిపి సమస్యని హైలైట్ చేసిన ప్రతిసారి, దానిపై వైసీపీ ఎదురుదాడికి దిగుతుంది. సమస్యలని గాలికొదిలేసి…అది గత టిడిపి ప్రభుత్వం తప్పే అని విధంగా మాట్లాడుతోంది. అయితే ప్రతి విషయంలోనూ వైసీపీ నేతలు అబద్దాలే చెబుతున్నారని తెలుగు తమ్ముళ్ళు ఫైర్ అవుతున్నారు.

అసలు ఏ అంశంపైన అయినా వైసీపీ నాయకులు పచ్చి అబద్దాలు చెప్పడానికి కూడా వెనుకాడటం లేదని, అబద్దాలు చెబుతున్నారని ప్రజలకు అర్ధమైన సరే, వైసీపీ నేతలు వెనక్కి తగ్గడం లేదని అంటున్నారు. తాజాగా టిడిపి నేతలు…రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు విపరీతంగా పెరగడంపై ఆందోళన కార్యక్రమాలు చేశారు. వీటిపై కేంద్రం ఎంత ట్యాక్స్ వాయిస్తుందో…అంతకంటే ఎక్కువగా జగన్ ప్రభుత్వం కూడా వాయిస్తుంది.

కానీ అవేమీ పట్టించుకోకుండా పెట్రోల్, డీజిల్, గ్యాస్ రేట్లు పెరగడానికి గత చంద్రబాబు ప్రభుత్వమే కారణమని వైసీపీ నేతలు దారుణమైన అబద్దాలు ఆడరని, అసలు ఇప్పుడు ట్యాక్సులు పెంచి ప్రజలని ఇబ్బంది పెడుతుంది జగన్ ప్రభుత్వం, కానీ అవేమీ పట్టించుకోకుండా దీనికి కారణం చంద్రబాబు అని చెప్పడం వైసీపీ నేతలకు బాగా అలవాటు అయిపోయిందని తమ్ముళ్ళు అంటున్నారు. ఇక జగన్ అధికారంలోకి వచ్చాక రోడ్లు ఏ స్థాయిలో నాశనమయ్యాయో అంతా చూస్తూనే ఉన్నారు.

రోడ్లని బాగు చేయాలని జగన్ ప్రభుత్వం ఆలోచన చేయకపోగా, గత చంద్రబాబు ప్రభుత్వం వల్లే రోడ్లు దెబ్బతిన్నాయని మాట్లాడుతున్నారు. అందులోనూ వైసీపీ నేతలు పొంతన లేకుండా అబద్దాలు చెబుతున్నారు. ఉదాహరణకు గత చంద్రబాబు ప్రభుత్వంలో నాసిరకమైన రోడ్లు వేయడం వల్ల రోడ్లకు గుంతలు పడ్డాయని వైసీపీ నేత దేవినేని అవినాష్ మాట్లాడారు.

అసలు చంద్రబాబు రోడ్లు వేయకపోవడం వల్లే ఈ సమస్య వచ్చిందని వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మాట్లాడుతున్నారు. అంటే వారి అబద్దాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చని తెలుగు తమ్ముళ్ళు చెబుతున్నారు. ట్రూ అప్ పేరిట కరెంట్ ఛార్జీలు బాదుడు కూడా మొదలుపెట్టారు…ఇక ఇది కూడా బాబు తప్పిదమే అని బ్లూ మీడియా ప్రచారం చేస్తోంది. అంటే ఏం జరిగినా చంద్రబాబే.. !

Discussion about this post