సాధారణంగా ఏ రాష్ట్రనికైనా ఒక్కరే ఆర్ధిక మంత్రి ఉంటారు. కాకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐదుగురు ఆర్ధిక మంత్రులు ఉంటే బాగుంటుందని సోషల్ మీడియాలో నెటిజన్లు కోరుతున్నారు. ఇలా ఐదుగురుని పెట్టుకోమనడానికి కూడా కారణాలు లేకపోలేదు. ప్రస్తుతం ఏపీకి ఐదుగురు డిప్యూటీ సీఎంలు ఉన్న విషయం తెలిసిందే. అయితే డిప్యూటీ సీఎంలు అప్పులు తీసుకురావడానికి తిరగలేరు కాబట్టి, ఐదుగురు ఆర్ధిక మంత్రులు పెడితే, అప్పులు తీసుకురావడానికి సులువుగా ఉంటుందని సెటైర్లు పేలుస్తున్నారు.

ఇప్పటికే అప్పులు తీసుకురానిదే నెల గడవని పరిస్తితి ఉన్న విషయం తెలిసిందే. రాష్ట్రానికి ఆదాయం వచ్చే మార్గాలని వదిలేసి అప్పులు వచ్చే మార్గాలని ఏపీ ప్రభుత్వం వెతుకుతుంది. గత రెండేళ్లలో ఏ స్థాయిలో అప్పులు చేశారో చెప్పాల్సిన పని లేదు. ఆఖరికి మద్యం మీద వచ్చే ఆదాయాన్ని షూరిటీగా పెట్టి మరీ అప్పులు తెచ్చారు. ఆ విషయాన్ని పిఏసి ఛైర్మన్ పయ్యావుల కేశవ్ బయటపెట్టేవారకు ఇలా కూడా అప్పులు తెస్తారని ఎవరూ అనుకోలేదు.అసలు వైసీపీ అధికారంలోకి వచ్చాక ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి దాటి రూ.లక్ష కోట్లకు పైగా అప్పులు తెచ్చి కేంద్రానికి తెలియకుండా దాచారని తెలుస్తోంది. అయితే ఆర్ధిక మంత్రిగా ఉన్న బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కేవలం రాష్ట్రానికి అప్పులు తీసుకురావడంలోనే బిజీగా ఉన్నారు. ఈయన ఏదొకవిధంగా రాష్ట్రానికి అప్పులు తీసుకురావడంలోనే కాలం గడిపేస్తున్నారు. పోనీ ఇన్ని అప్పులు ఎందుకంటే ప్రజల కోసమే అని కవర్ చేసుకుంటున్నారు. అలాగే పయ్యావుల కేశవ్ లాంటి వారు లెక్కలు అడిగితే, లాజిక్ లేకుండా మాట్లాడేస్తున్నారు.

అయితే ఇలా అప్పులు తీసుకురావడం ఒక్క బుగ్గన బాధ్యత అయిపోయింది. అదే ఓ ఐదుగురు ఆర్ధిక మంత్రులు ఉంటే ఇంకా ఎక్కువ అప్పులు తీసుకురావడానికి తిరుగుతారని సోషల్ మీడియాలో జోరుగా సెటైర్లు పేలుతున్నాయి.
Discussion about this post