తెలుగుదేశం పార్టీ కంటే గొప్పగా చేస్తాను అంటూ జనాలకు ఎన్నో హామీలు ఇచ్చి అధికారం పట్టేసిన జగన్ కి హానీమూన్ ముగిసిందా అన్న చర్చ అయితే గట్టిగా సాగుతోంది. ఆయన తెచ్చిన అప్పులులో ఏపీ రుణాంధ్రప్రదేశ్ గా మారిపోయింది. దాంతో రేపు అన్న ఆశ కనుచూపు మేరలో లేకుండా పోయింది. మరో వైపు చూసుకుంటే రూపాయ్ అప్పు కూడా బయట ఎక్కడా పుట్టే చాన్స్ అయితే లేదు అంటున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నపుడు తెచ్చిన అప్పులను ప్రణాళికా వ్యయంగా చూపిస్తూ ఖర్చు చేసేది. అది అభివృద్ధి కార్యక్రమాలకు మళ్ళి బాగానే రిటర్న్స్ వచ్చేవి. దాంతో అప్పులు మళ్ళీ తీర్చేందుకు వీలు ఉండేది. కానీ జగన్ ఏలుబడిలో తెచ్చిన అప్పులతో పంచుడు కార్యక్రమం స్టార్ట్ చేశారు.
ఎక్కడికక్కడ అప్పులు తెచ్చేసి వాటిని సంక్షేమ పధకాలకు లక్షల కోట్లు వెచ్చించారు. దీని వల్ల అప్పులు అలాగే ఉండిపోతున్నాయి. తెచ్చిన అప్పులకు వడ్డీల భారం కూడా పెరిగిపోతూ ఏపీ ఆర్ధిక వ్యవస్థ గాడి తప్పిపోతోంది. దీని వల్ల భవిష్యత్తు తరాలకు ఏమీ మిగిలే సీన్ కూడా కనిపించడం లేదు. సరే కరోనా కాలంలో కూడా సంక్షేమ పధకాలు అమలు చేశామని గొప్పగా డప్పు వాయించుకుంటున్న వైసీఎపీ సర్కార్ కి ముందుంది ముసళ్ళ పండుగ అంటున్నారు. ఇక అప్పు ఎక్కడా పుట్టదు అని స్పష్టమైన సంకేతాలు వచ్చేశాయి. కేంద్ర పెద్దల వద్దకు ఈ మధ్యన ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి వెళ్ళి ఏపీని ఆదుకోమని కోరుతూ వచ్చారు.
అయితే ఏపీలో అప్పులన్నీ కూడా పంచుడు కార్యక్రమానికి వెచ్చించడం మీద కేంద్రం కూడా గుర్రుగానే ఉంది. ఆర్ధిక క్రమశిక్షణ అన్నది ఏపీలో లేదని కూడా వారికి అర్ధమైపోయింది. ఈ రకంగా దుబారా చేస్తూ నిధులు కావాలి అంటే ఎన్ని ఇచ్చినా ఏమి ప్రయోజనం అన్నట్లుగా కేంద్రం ఆలోచనలు ఉన్నాయి. ఇక రుణ పరిమితిని కూడా దాటేసి ఏపీ సర్కార్ అప్పులు చేసేసింది. రానున్న రోజుల్లో కొత్త రూపాయి కూడా అప్పుగా దొరకదు అంటున్నారు. మరో వైపు రెండేళ్లలో ఏపీలో పాలనా పరమైన వైఫల్యాలు కారణంగా ఆదాయాలు దారుణంగా పడిపోయాయి. ఈ నేపధ్యంలో ముందు మూడేళ్ళ పాలన ఉంది. అడుగు తీసి అడుగు వేయాలంటే కూడా జగన్ సర్కార్ కి మహా కష్టమని అంటున్నారు. చూడాలి మరి జగన్ రెడ్డి ఎలా నెట్టుకువస్తారో.
Discussion about this post