జగన్ బలం అంతా ఆయన తండ్రి వైఎస్సార్ పొలిటికల్ ఇమేజ్ మీద ఆధారపడి ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీకి మూడున్నర దశాబ్దాల పాటు వైఎస్సార్ సేవ చేశారు. దాంతో కాంగ్రెస్ పార్టీ బలం కూడా జగన్ కి అలా కలసి వచ్చింది. అడ్డగోలు విభజనతో కాంగ్రెస్ ఏపీలో నామరూపాలు లేకుండా పోయింది. ఫలితంగా ఏపీలో మొత్తం కాంగ్రెస్ ఓట్లు అన్నీ కూడా గుత్తమొత్తంగా జగన్ వైపు వచ్చేశాయి. కాంగ్రెస్ కి సహజంగా ఉండే ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్ ఓటు బ్యాంక్ మొత్తం జగన్ వైపు ఉంది. ఇక కాంగ్రెస్ ని దశాబ్దాలుగా నమ్ముకుని ముఖ్యమంత్రులు, మంత్రులు అయిన రెడ్లు కూడా జగన్ కి అండగా నిలబడ్డారు. జగన్ సీఎం అయితే చాలు అన్నది వారి కోరిక.

అయితే జగన్ సీఎం అయ్యారు. పాలన చేస్తున్నారు. తమకేమి ఒరిగింది అన్నదే రెడ్ల బాధ. రాజకీయం ఎలా ఉంటుంది అంటే తనకు కనుక లాభం లేకపోతే సొంత తమ్ముడితో కూడా విభేదించి బయటకు వచ్చేసేవారు ఉంటారు. ఏపీలో జగన్ తమ సామాజికవర్గమని ఎంత కాలం భుజాన మోస్తామని రెడ్లు అంటున్నారు. పైగా తమ వ్యాపారాలు అన్నీ పోయాయని, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎన్నికల్లో గెలిస్తే జగన్ ఏమీ కాకుండా చేశారని వారు మధనపడుతున్నారు. జగన్ ప్రభుత్వంలో మంత్రులే పెద్దగా పవర్ ఫుల్ గా కనిపించరు. దాంతో ఇది తమ ప్రభుత్వమేనా అన్న ఆవేదన వారికి పట్టుకుంది.

సరిగ్గా ఈ సమయంలోనే కాంగ్రెస్ ఏపీ మీద దృష్టి పెట్టింది అంటున్నారు. రాహుల్ గాంధీ ఏపీలో కాంగ్రెస్ ని ఒడ్డున పడేసేందుకు అన్ని రకాలైన కసరత్తులను చేస్తున్నారు. ఏపీలో వైసీపీ మీద జనాల్లో వ్యతిరేకత వచ్చిందని, దాన్ని సొమ్ము చేసుకోవడానికి ఇదే సమయమని కూడా కాంగ్రెస్ భావిస్తోంది. మరో వైపు చూస్తే దేశంలో పరిస్థితులు కూడా కాంగ్రెస్ కి అనుకూలంగా మారుతున్నాయి. ఆ ప్రభావం కనుక ఏపీ మీద పడితే కాంగ్రెస్ మళ్లీ లేవడం ఏమంత కష్టం కాదు అన్న భావన ఉంది. ఇక ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా బీజేపీ మోసం చేసింది అన్న బాధ అయితే జనంలో ఉంది.
మళ్ళీ దేశంలో బీజేపీ వచ్చినా ఇంతే సంగతులు అని కూడా ఏపీ ప్రజలు అర్ధం చేసుకున్నారు. ఈ నేపధ్యంలో ఏపటి రోజున మోడీని దించే సత్తా కాంగ్రెస్ కి ఉందని భావిస్తే మాత్రం ఏపీలో రాజకీయ పరిణామాలు కూడా చకచకా మారిపోవడం ఖాయమే. అదే సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తాం, విభజన హామీలు నెరవేరుస్తమని కాంగ్రెస్ కనుక గట్టిగా చైబితే ఏపీ జనాలు టర్న్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అది అంతిమంగా వైసీపీ ఓటు బ్యాంక్ కే భారీగా దెబ్బతీస్తుంది అంటున్నారు.

Discussion about this post