గత ఎన్నికల ముందు పాదయాత్ర చేసే సమయంలో జగన్, చంద్రబాబు ప్రభుత్వం అమలు చేస్తున్న మద్యం పాలసీ పై తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. చంద్రబాబు ప్రభుత్వం మద్యాన్ని ఏరులై పారిస్తుందని జగన్ విమర్శించారు. మద్యం వల్ల ఎన్నో కుటుంబాలు నాశనమైపోయాయని, అందుకే తాను అధికారంలోకి వస్తే అక్కాచెల్లెళ్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి హామీ ఇచ్చారు.
అధికారంలోకి వచ్చిన జగన్ దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తానని చెప్పుకొచ్చారు. ఏదో కొన్ని షాపుల తగ్గించి, మిగిలిన షాపులన్నీ ప్రభుత్వం నడిపిస్తూ, అలాగే అందులో వేలకు వేలు జీతాలు ఇస్తూ, ఉద్యోగులని పెట్టి మద్యం అమ్మకాలు చేస్తున్నారు. అలాగే మద్యం రేట్లు విపరీతంగా పెంచేసి మందుబాబుల నడ్డి విరిచారు. అదేమంటే రేట్లు పెంచితే మద్యం తాగే వారు తగ్గుతారని లాజిక్ చెప్పారు. అలాగే సొంతంగా బ్రాండ్లు తీసుకొచ్చి మందుబాబుల ఆరోగ్యంతో ఆదుకోవడం మొదలుపెట్టారు.ఇది జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న మద్యపాన నిషేధం. అంటే మద్యపాన నిషేధం ఉండదని అర్ధమవుతుంది. ఇంకా చెప్పాలంటే జగన్ ప్రభుత్వం, మందుబాబులకు ఓ గుడ్ న్యూస్ కూడా చెప్పేసింది. ఇక శాశ్వతంగా మద్యపాన నిషేధం ఉండదని ప్రభుత్వం చెప్పకనే చెప్పింది.
తాజాగా జగన్ ప్రభుత్వం మద్యం ద్వారా వచ్చే ఆదాయాన్ని షూరిటీ గా పెట్టి 25 వేల కోట్లు అప్పు తీసుకొచ్చింది. 15 ఏళ్ల పాటు మద్యం ఆదాయం షూరిటీ గా పెట్టి ఈ అప్పు తీసుకొచ్చారు. అంటే దీన్ని బట్టి చూస్తే ఇక మద్యపాన నిషేధం ఉండదనే చెప్పొచ్చు. కాబట్టి మందుబాబులు ఏ మాత్రం కంగారు పడాల్సిన పని లేదు. ఏదేమైనా మద్యపాన నిషేధంలో జగన్ మాట తప్పేశారని చెప్పొచ్చు.
Discussion about this post