ఏపీలో కాంగ్రెస్ ని ఆయాసపడి అయినా పెద్ద ఎత్తున లేపడానికి రంగం సిద్ధమవుతోందా ? అంటే అవును అనే సమాధానం వస్తోంది. నిజానికి ఏ బేస్ లేని బీజేపీ ఏపీలో సత్తా చాటడానికి చూస్తూంటే ఎన్నో పర్యాయాలు అధికారంలోకి వచ్చి ఈ రోజుకూ ప్రతీ ఊళ్ళూనూ ఎన్నో కొన్ని ఓట్లు ఉన్న కాంగ్రెస్ ఎందుకు ? ఏపీని వదిలేసింది అన్న చర్చ అయితే ఉంది. దాంతో సాక్ష్తాత్తూ రాహుల్ గాంధీయే తాను ఏపీ కాంగ్రెస్ కి కొత్త ఊపిరులు అందిస్తాను అంటున్నారు. ఈ రోజుకు కూడా రాష్ట్ర కాంగ్రెస్‌లో సీనియర్ నేతలు ఎంతో మంది ఉన్నారని, వారంతా జనాలలో తిరగాలని కూడా రాహుల్ కోరినట్లుగా చెబుతున్నారు.
ఇక మీదట రాహుల్ ఏపీలో కాంగ్రెస్ ని బలోపేతం చేసే దాని మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు అంటున్నారు. తెలంగాణాలో కొత్త పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ని ముందుకు కదిలిస్తున్నారు. ఇపుడు ఏపీకి కూడా సరైన రౌతు దొరికితే చాలు అన్నట్లుగా కాంగ్రెస్ పెద్దల ఆలోచనలు ఉన్నాయట. ఏపీలో టీడీపీ పని అయిపోయిందని కూడా కాంగ్రెస్ ని నివేదికలు ఉన్నాయట. అదే సమయంలో అధికార వైసీపీ మీద జనంలో తీవ్ర వ్యతిరేకత ఉందని కూడా అంచనాకు వస్తున్నారుట. ఆ వ్యతిరేకతను ఒడిసిపట్టే పార్టీగా కాంగ్రెస్ ముందుంటే ఏపీలో అద్భుతాలే జరుగుతాయని కూడా ఊహిస్తున్నారుట.
ఇక ఏపీ కాంగ్రెస్ వ్యవహారాలు చూస్తున్న ఉమెన్ చాందీ మీద రాహుల్ పెద్ద బాధ్యతలే పెట్టారని టాక్. ఏపీలో కాంగ్రెస్ లో సీనియర్లు ఎవరు ఉత్సాహంగా ఉన్నారు, ఎవరు లేరు, ఎందుకు వారు అలా లేరు ఇలాంటి సమాచారాన్ని కూడా ఆయన కోరారని అంటున్నారు. మరో వైపు వైసీపీ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చే వారుంటే కూడా వాకబు చేయాలని కోరారట. అదే విధంగా 2014 టైమ్ లో టీడీపీ సహా ఇతర పార్టీలలోకి వెళ్ళిపోయిన వారిని తిరిగి తీసుకువచ్చేలా ఘర్ వాపసీ కార్యక్రమాన్ని పెద్ద ఎత్త్తున కాంగ్రెస్ చేపట్టేందుకు కూడా మాస్టర్ ప్లాన్ రూపొందిస్తోందని అంటున్నారు. మరి చూడాలి కాంగ్రెస్ ఆశలు ఏపీలో ఎంతమేరకు నెరవేరతాయో.
Discussion about this post