సాధారణంగా మంత్రులను , ముఖ్యమంత్రులను ఎన్నుకోవడంలో ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయన్న విషయం తెలిసిందే.అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల పదవులలో ఉన్న అభ్యర్థులు మరణించినా లేదా ఆ పదవికి రాజీనామా చేసినా తిరిగి ఎన్నికలు జరగడం లేక ఏకగ్రీవం చేయడం జరుగుతుంది.ఇప్పుడు మన తెలుగు రెండు రాష్ట్రాలు ఉప ఎన్నికలకు సిద్ధం అవుతున్నాయి. ప్రస్తుతం మనదేశంలో కరోనా తగ్గుముఖం పట్టడంతో ఇక త్వరలోనే ఉప ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ను విడుదల చేసేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ సిద్ధం అవుతోంది.
తెలుగు రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్రం నుండి హుజురాబాద్ లో ఎన్నికలు జరుగుతుండగా, ఆంధ్ర ప్రదేశ్ నుండి బద్వేల్ నియోజకవర్గానికి ఉపఎన్నికలు సెప్టెంబర్ నెలలో జరగనున్నాయి. హుజురాబాద్ లో టీఆర్ఎస్ తరఫున మంత్రి పదవిలో ఉన్న మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా టీఆర్ఎస్, బీ జే పీ ల మధ్య పెద్ద ఎత్తున పోటీ నెలకొంది. కాంగ్రెస్ కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమవుతోంది. పోయిన ఎన్నికలలో కాంగ్రెస్ తరపున కౌశిక్ రెడ్డి పోటీ చేసి ఎవరూ ఊహించని విధంగా 30 వేల ఓట్ల తేడాతో మంత్రి ఈటల రాజేందర్ చేతిలో ఘోరంగా ఓడిపోయారు.ఇక ఈసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి కౌశిక్ రెడ్డి మరోసారి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇక్కడ ఈటెల రాజేందర్ బీజేపీలో చేరడం వల్ల బీజేపీ తరఫున ఆయన పోటీ చేసే అవకాశం ఉంది. అధికార పార్టీ అభ్యర్థి కూడా , ఈటెల కు గట్టి పోటీ ఇచ్చే అభ్యర్థిని కేసీఆర్ ప్రకటిస్తారని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇక ఉప ఎన్నికల తేదీ ఖరారు చేయకు ముందే అన్ని పార్టీల అభ్యర్థులు ప్రచారాలను ముమ్మరం చేశాయి.
ఇక ఆంధ్రప్రదేశ్ ఉప ఎన్నికల విషయానికి వస్తే , బద్వేల్ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య మరణించడంతో, అక్కడ కూడా ఉప ఎన్నికలు ప్రారంభం కానున్నాయి. అయితే వైఎస్ జగన్ ప్రభుత్వం ఈ ఎన్నికలలో వెంకటసుబ్బయ్య సతీమణిని , వైసీపీ తరపున అభ్యర్థిగా ఖరారు చేసిన విషయం తెలిసిందే. టీడీపీ తన అభ్యర్థిని ఎన్నికల బరిలో దింపాలో ?లేదో?అని ఆలోచనలో పడింది. బీజేపీ మాత్రం తమ అభ్యర్థి ఎన్నికల బరిలో దిగుతారని ప్రకటించడం జరిగింది. ఏదేమైనా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉప ఎన్నికల హడావిడి అయితే త్వరలోనే ప్రారంభం కానుంది.
Discussion about this post