ఏవీ సుబ్బారెడ్డి….టిడిపి సీనియర్ నాయకుడు. గత కొన్నేళ్లుగా కర్నూలు జిల్లాలో కీలకంగా వ్యవహరిస్తున్న నేత. అయితే పార్టీ తరుపున పనిచేస్తున్న ఈ నేత…వచ్చే ఎన్నికల్లో టికెట్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు తనకు కూడా ఒక ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్నారు. అయితే మొదట నుంచి పార్టీలో పని చేస్తున్న ఏవీకి, భూమా ఫ్యామిలీతో మంచి సంబంధాలు ఉండేవి. భూమా నాగిరెడ్డి, ఏవీ సుబ్బారెడ్డిలు మంచి స్నేహితులు కూడా.

కానీ భూమా మరణించాక కర్నూలు జిల్లా రాజకీయాలు మారిపోయాయి. భూమా ఫ్యామిలీకి ఏవీతో అసలు పడటం లేదు. గతంలో టిడిపి అధికారంలో ఉండగా భూమా అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డిల మధ్య ఆధిపత్య పోరు నడిచింది. ఓ రకంగా అఖిల డామినేషన్ బాగా నడిచింది. ఇక వీరి ఆధిపత్య పోరుకు చెక్ పెట్టేందుకు చంద్రబాబు కూడా బాగానే ప్రయత్నించారు. అధికారంలో ఉండగా వీరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు చూశారు. కానీ ఇది అంతగా వర్కౌట్ కాలేదు. ఈ రెండు ఫ్యామిలీల మధ్య రచ్చ కొనసాగుతూనే ఉంది. ఈ రచ్చ ఎక్కడవరకు వెళ్లింది అంటే…అఖిల…తనని చంపడానికి కుట్ర పన్నుతుందని ఏవీ ఆరోపించేవరకు వెళ్లింది. ఆయన్ని చంపడానికి అఖిల కొందరిని పురమాయించిందని కూడా కేసు నమోదైంది. ఇలా వీరి మధ్య రచ్చ జరుగుతుండగానే, ఏవీ ఈ సారి నంద్యాల లేదా ఆళ్లగడ్డ సీటు ఇవ్వాలని బాబుని కోరుతున్నారట. పైగా తన కుమార్తె జస్వంతి కూడా పార్టీలో యాక్టివ్‌గా పనిచేస్తుంది.

దీంతో వచ్చే ఎన్నికల్లో తమ ఫ్యామిలీకి కూడా ఒక సీటు అడుగుతున్నారు. అయితే ఆళ్లగడ్డలో భూమా అఖిలప్రియ ఉన్నారు. నంద్యాలలో భూమా బ్రహ్మానందరెడ్డి ఉన్నారు. మరి వీరిని కాదని బాబు, ఏవీ సుబ్బారెడ్డికి సీటు ఇవ్వడం జరుగుతుందా? అనేది చెప్పలేని పరిస్తితి ఉంది. మరి చూడాలి ఏవీకి బాబు ఎలాంటి ఛాన్స్ ఇస్తారో..?
Discussion about this post