ఒకే ఒక్క ఛాన్స్ అని అడిగి అధికారంలోకి వచ్చిన జగన్… వరుసగా ప్రజల నెత్తి మీద ఎలాంటి పిడుగులు వేస్తున్నారో చెప్పాల్సిన పని లేదు. వరుస పెట్టి ప్రజలపై పన్నుల భారం వేసుకుంటూ, ప్రజలు ఆర్ధికంగా బాగా నష్టపోయేలా చేస్తున్నారు. జగన్ అధికారంలోకి వచ్చాక కరెంట్ బిల్లులు, ఇంటి పన్నులు, ఆర్టీసీ ఛార్జీలు, పెట్రోల్, డీజిల్‌లపై అదనంగా ట్యాక్స్‌లు, అసలు ప్రజలకు అవసరమైన వస్తువుపైన జగన్ ప్రభుత్వం భారం మోపుతూనే వచ్చింది.

అసలు సామాన్యుడుకు ధరలు అందుబాటులో లేకుండాపోయాయి. పైగా కరోనా సమయంలో ఆర్ధికంగా బాగా నష్టపోయారు. ఇలాంటి పరిస్తితుల్లో అండగా ఉండాలసిన ప్రభుత్వం, మరింత భారం అయింది. మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల ముందు ప్రజలకు వరాలు కురిపించిన జగన్ ప్రభుత్వం…ఎన్నికల్లో గెలిచాక ప్రజలపై పన్నుల భారం పెంచారు. ఆస్తిపన్ను పెంచారు. అలాగే కొత్తగా చెత్తపై పన్ను, బాత్‌రూమ్‌పై పన్ను అంటూ…జగన్ ప్రభుత్వం, ప్రజల దగ్గర నుంచి ముక్కు పిండి మరీ డబ్బులు వసూలు చేస్తుంది.

ఇలా చాలా అంశాల్లో ప్రజలపై పిడుగులు వర్షం కురిపిస్తున్న జగన్…తాజాగా ప్రజలపై మరో పిడుగు వేశారు. నీటి మీటర్లు బిగించేందుకు జగన్ ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఇప్పటికే రైతులు వ్యవసాయానికి ఉపయోగించే మోటర్లకు మీటర్లు బిగించి, వారికి చుక్కలు చూపిస్తున్న జగన్ ప్రభుత్వం ఇప్పుడు.. అమృత్ పథకంలో భాగంగా రాష్ట్రంలో నీటి మీటర్లను ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతుంది.ప్రస్తుతం నీటి మీటర్ల ఏర్పాటు విషయంలో పట్టణాల్లో అధికారులు దూకుడు ప్రదర్శిస్తున్నారు. దీంతో పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలు హడలిపోతున్నారు. అయితే ఇదే నీటి మీటర్ల విషయాన్ని వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వ్యతిరేకించి, ఇప్పుడు ప్రజలపై భారం మోపడానికి ఏ మాత్రం వెనుకడుగు వేయడం లేదు.
Discussion about this post