Site icon Neti Telugu

కంచుకోటల్లో వైసీపీ డౌన్..భారీ షాక్ అంటే ఇదే!

అసలు జగన్ గాని, వైసీపీ నేతలు గాని మాట మాటకు వై నాట్ 175 అంటూ ముందుకెళుతున్న విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో 151 సీట్లు గెలుచుకుని అధికారంలోకి వచ్చాం..అన్నీ మంచి పనులే చేస్తున్నాం..కాబట్టి ఈ సారి ప్రజలు 175 సీట్లలో గెలుపిస్తారని జగన్ అంటున్నారు. అలాగే అన్నీ ఎన్నికల్లో గెలిచాం కాబట్టి..175 సీట్లలో ఎందుకు గెలవలేమని జగన్ చెబుతున్నారు.

ముఖ్యంగా చంద్రబాబు సొంత స్థానం కుప్పంతో కలిపి వై నాట్ 175 అంటున్నారు. ఇలా టార్గెట్ గా పెట్టుకుని ముందుకెళుతున్నారు. కానీ ఈ టార్గెట్ రీచ్ అవ్వడం జరిగే పని కాదనే సంగతి తెలిసిందే..టార్గెట్ సంగతి పక్కన పెడితే..అసలు మ్యాజిక్ ఫిగర్ దాటి అధికారంలోకి రావడమే కష్టమని తేలిపోయింది. అసలు కంచుకోటల్లాంటి స్థానాల్లోనే వైసీపీకి రివర్స్ అవుతుంది. తాజాగా తూర్పు రాయలసీమ, పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల ఫలితాలని చూస్తే వైసీపీ పని కంచుకోటల్లో కూడా అయిపోయిందని అర్ధమవుతుంది.

Exit mobile version