ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు హడావిడి తగ్గుతున్నట్లు కనిపిస్తోంది. ఇంతకాలం బీజేపీ అధ్యక్షుడుగా ఉన్న సోము వీర్రాజు…బీజేపీ కోసం కష్టపడింది తక్కువ…జగన్‌కు సపోర్ట్‌గా నిలబడింది ఎక్కువ అనే విమర్శలు కొనితెచ్చుకున్నారు. అసలు బీజేపీ అధ్యక్షుడుగా సోము, జగన్‌పై డైరక్ట్‌గా విమర్శలు చేసిన సందర్భాలు చాలా తక్కువ. పైగా ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబుపై సోము ఎక్కువ విమర్శలు చేస్తూ వచ్చారు.

అలాగే జగన్‌కు వ్యతిరేకంగా మాట్లాడే బీజేపీ నేతలని ఎక్కువ సైలెంట్ చేసేశారు. దీంతో సోము పూర్తిగా జగన్‌కు అనుకూలంగా పనిచేస్తున్నారనే విమర్శలు వచ్చాయి. పైగా సోము నేతృత్వంలో రాష్ట్రంలో బీజేపీ కొంచెం కూడా బలపడలేదు. ఈ క్రమంలోనే సోముని అధ్యక్ష పీఠం నుంచి తప్పించి, మళ్ళీ కన్నా లక్ష్మినారాయణకు బాధ్యలు అప్పగించనున్నారని తెలుస్తోంది.గతంలో అధ్యక్షుడుగా చేసిన కన్నా, ఈ స్థాయిలో జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడేవారో అందరికీ తెలిసిందే. అయితే అధ్యక్ష పదవి పోయాక కన్నా సైలెంట్ అయిపోయారు. కానీ తాజాగా కన్నాకే మళ్ళీ బాధ్యతలు అప్పగిస్తున్నారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో, కన్నా మళ్ళీ దూకుడుగా జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ఏపీలో సెంట్రలైజ్డ్ అవినీతి జరుగుతోందని, 50 ఏళ్లలో ఇలాంటి అవినీతిని ఎప్పుడూ చూడలేదని కన్నా ఫైర్ అవుతున్నారు. 2008లో వైఎస్సార్ తెచ్చిన ఆన్లైన్ జీవోల విధానాన్ని జగన్ నిలిపివేశారని, రహస్య పాలన నడపాలి అని ప్రభుత్వం భావిస్తోందని మండిపడ్డారు.

అయితే కన్నా ఇలా ఫామ్‌లోకి రావడంతో సోము కూడా తన పదవిని కాపాడుకోవడం కోసం, జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం మొదలుపెట్టారు. ఆయన కూడా దూకుడుగా ఉంటున్నారు. కానీ ఇప్పటికే సోము, జగన్ జేబులో మనిషి అని ప్రజలకి అర్ధమైపోయినట్లే కనిపిస్తోంది. ఈ క్రమంలో సోముని అధ్యక్ష పీఠం నుంచి తప్పించి, ఆ బాధ్యతలు కన్నాకు అప్పగించే అవకాశాలున్నాయని తెలుస్తోంది.
Discussion about this post