గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం…మొదట నుంచి టీడీపీకి అనుకూలమైన నియోజకవర్గం. ఇక్కడ ఎక్కువసార్లు టీడీపీ జెండానే ఎగిరింది. అయితే 2019 ఎన్నికల్లో తెనాలిలో వైసీపీ విజయం సాధించింది. రాజధాని అమరావతి ప్రాంతానికి కూతవేటు దూరంలో ఉండే తెనాలిలో టీడీపీ ఓటమి పాలవ్వడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే జగన్ గాలిలో తెనాలిలో కూడా టీడీపీ ఓడింది. వైసీపీ తరుపున పోటీ చేసిన అన్నాబత్తుని శివకుమార్, టీడీపీ నేత ఆలపాటి రాజాపై విజయం సాధించారు. ఇక ఈ ఇద్దరు నేతలు కమ్మ సామాజికవర్గానికి చెందినవారే. ఎమ్మెల్యేగా గెలిచాక శివకుమార్, నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి శూన్యమని తెలుస్తోంది.

టీడీపీ హయాంలో నియోజకవర్గంలో అభివృద్ధి శరవేగంగా జరిగింది. పైగా రాజధాని పక్కనే ఉండటంతో తెనాలికి కలిసొచ్చింది. కానీ జగన్ అధికారంలోకి వచ్చాక అమరావతిని ఎలా దెబ్బకొట్టారో అందరికీ తెలిసిందే. అయితే దీనికి అమరావతి ప్రాంతం పరిధిలో ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలు కూడా మద్ధతు ఇచ్చారు. ఇక ఇదే ఇప్పుడు ఎమ్మెల్యే శివకుమార్ పాలిట శాపంగా మారింది. ఇప్పుడు అధికారంలో ఉండటం వల్ల లోకల్ ఎన్నికల్లో గెలిచారు గానీ, నెక్స్ట్ ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ గెలుపు గగనమే అని విశ్లేషణలు వస్తున్నాయి. పైగా ఎమ్మెల్యే పనితీరు పట్ల తెనాలి ప్రజలు సంతృప్తిగా ఉన్నట్లు కనిపించడం లేదు.

దానికి తోడు ఎమ్మెల్యే నియోజకవర్గంలో పలు అక్రమాలు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఇక రాజధాని ఉద్యమం తీవ్రంగా ఉన్న సమయంలో శివకుమార్, చంద్రబాబుని వ్యక్తిగతంగా దూషించడం, ఉద్యమం చేస్తున్న ప్రజలని నానా ఇబ్బందులకు గురి చేయడం మైనస్ అయింది. అదే సమయంలో టీడీపీ నేత ఆలపాటి రాజా ప్రజల్లోనే ఉంటూ, వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నారు. అటు రాజధాని కోసం చేస్తున్న ప్రజలకు అండగా నిలబడుతున్నారు. ఈ పరిణామాలని బట్టి చూస్తే తెనాలిలో టీడీపీ లీడ్‌లోకి వచ్చినట్లే కనిపిస్తోంది. నెక్స్ట్ ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ గెలవడం కష్టమే.

Discussion about this post