ప్రస్తుతం ఎంతో మంది సినిమాల నుంచి, రాజకీయాల వైపు వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలనాటి స్టార్ హీరో హీరయిన్ ల నుంచి, ఇప్పటివరకు వున్న ఎంతో మంది నటులు రాజకీయాల్లో ఉండి, ఆ తర్వాత తిరిగి ఇటు వచ్చిన వారే ఉన్నారు. అలా వెళ్లినవారిలో కొంత మంది సక్సెస్ అయ్యారు, మరికొంతమంది సక్సెస్ కాలేక వెనక్కి తిరిగి వచ్చేశారు. ఇక అలాంటి వారిలో ఇప్పుడు ఒక నటి త్వరలో రాజకీయ ఎంట్రీ చేయబోతోందట. ఇక ఆమె గురించి తెలుసుకుందాం.
ఇక ఆమె ఎవరో కాదు బిగ్ బాస్ లో పాల్గొన్న నటులలో కత్తి కార్తీక కూడా ఒకరు. ఇక ఈమె కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు సమాచారం. తెలంగాణలో కాంగ్రెస్ క్యాంపస్ కమిటీ చైర్మన్ ను ఈమె కలిసినట్లు సమాచారం. ఈమె ఎక్కువగా కాంగ్రెస్ పార్టీలోనే చేరడానికి ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ క్యాంపస్ చైర్మన్ మధు కూడా ఈమెను ఆహ్వానించారని తెలుస్తోంది.
ఈమె 2020లో దుబ్బాక బై ఎలక్షన్లలో ఏ పార్టీ తరఫున కాకుండా సింగిల్ గా పోటీ చేసింది. ఎంతటి ప్రచారం చేసినా కూడా, అదృష్టం లేక ఓడిపోయింది. ఎంతలా అంటే కనీసం డిపాజిట్లు కూడా దక్కలేనంతగా ఓడిపోయింది. ఇక ఈమె ఆలోచించింది ఏమిటంటే.. ఒక బలమైన పార్టీ సపోర్టు ఉంటే మంచిదని అనుకున్నది. అందుచేతనే త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరతారని నిర్ణయించుకుంది. ఇక కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ని కలిసి కండువా కప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.
ఇక ఈమె ఇలా చేయడం ద్వారా, తెలంగాణలోని రాజకీయాలు చాలా ఆసక్తికరంగా మారాయి.. ఎందుకంటే టిఆర్ఎస్ పార్టీలో కీలక నేత అయినటువంటి పద్మారావు గౌడ్ ఈమెకు బంధువులు అవుతారు. ఇక ఇప్పుడు అపోజిషన్ పార్టీలోకి ఏమి చేయడం వలన, అటు ఆమె బంధువుల నుంచి కానీ మరే ఇతర వారి నుంచి కానీ వచ్చే సమస్యలు ఎన్నో ఉంటాయని పలువురు చర్చించుకుంటున్నారు. అయితే ఈసారైనా ఆమె ఎలక్షన్స్ లో నిలబడి ,తను అనుకున్నది సాధించాలని మనం కూడా ఆశిద్దాం.
Discussion about this post