గతంలో చంద్రబాబు ప్రభుత్వం మంచిగా అభివృద్ధి కార్యక్రమాలు చేయడంతో పాటు, ప్రజలకు సంక్షేమ పథకాలు అందించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు అధికారంలో ఉన్న జగన్ అభివృద్ధి విషయాన్ని ఏ మాత్రం పట్టించుకోకపోయినా, సంక్షేమ పథకాల అమలులో కాస్త ముందే ఉన్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి సంక్షేమ పథకాలని బాగానే అమలు చేస్తున్నారు.
కానీ పథకాల్లో చాలా రూల్స్ పెట్టి ఇస్తున్నారు. పైగా కొన్ని పథకాలు గత చంద్రబాబు ప్రభుత్వ పథకాలకు కాపీగానే ఉన్నాయి. అలా కొన్ని పథకాలని కాపీ కొట్టి, వాటిని తామే మొదటిసారి అమలు చేస్తున్నట్లు గొప్పగా చెప్పుకోవడాన్ని టీడీపీ నేతలు తప్పుబడుతున్నారు. తాజాగా జగన్ ప్రభుత్వం తీసుకొచ్చి వైఎస్సార్ బీమా పథకంపై టీడీపీ నుంచి అనేక విమర్శలు వస్తున్నాయి.ఈ వైఎస్సార్ బీమా పథకం ద్వారా 18 నుంచి 50 ఏళ్ల వయసున్న కుటుంబ యజమాని సహజ మరణం పొందితే రూ.లక్ష, 18 నుంచి 70 ఏళ్ల వయసు కలిగిన కుటుంబ యజమాని ప్రమాదంలో మరణించినా, వైకల్యం పాలైనా ఆ కుటుంబానికి రూ.5 లక్షలు వైఎస్సార్ బీమా పథకం ద్వారా చెల్లించనున్నారు. అయితే గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో కూడా ఇదే స్కీమ్ ఉందని చెబుతున్నారు. పైగా అప్పుడు చంద్రన్న బీమా కింద 18 నుంచి 50 ఏళ్ల వయసున్న కుటుంబ యజమాని సహజ మరణం పొందితే రెండు లక్షలు అందించామని అంటున్నారు.
అప్పుడు 2.5 కోట్ల మందికి స్కీమ్ ఇస్తే, ఇప్పుడు 1.20 కోట్ల మందికే స్కీమ్ ఇస్తున్నారని, చంద్రన్న బీమా కుటుంబంలో అందరికీ కవర్ కాగా, వైఎస్సార్ బీమా కుటుంబంలో ఒక్కరికే వర్తించేలా కుదించారని విమర్శిస్తున్నారు. వాస్తవానికి చూస్తుంటే గతంలో అమలైన పథకాన్ని ఇప్పుడు జగన్ ప్రభుత్వం అమలు చేస్తూ, దాన్ని కుదించి, అదే పథకాన్ని గొప్పగా అమలు చేస్తున్నట్లు చెప్పుకుంటుందనే చెప్పొచ్చు.
Discussion about this post