ఏపీలో బిజేపికి ఎంత బలం ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ పార్టీకి కనీసం నోటా ఓట్లని దాటే బలం కూడా ఏపీలో లేదు. భవిష్యత్‌లో కూడా ఆ పార్టీ పరిస్తితి అలాగే ఉండేలా కనిపిస్తోంది. ఎంత పుంజుకోవాలని ప్రయత్నించిన కూడా బిజేపి వల్ల కాదనే చెప్పొచ్చు. ఎందుకంటే ఏపీకి అన్యాయం చేస్తున్న బిజేపిని ప్రజలు నమ్మే పరిస్తితుల్లో లేరు. కాకపోతే కేంద్రంలో అధికారంలో ఉండటంతో కాస్త బిజేపి నేతలు హడావిడి చేస్తున్నారు అంతే..అయితే నెక్స్ట్ ఎన్నికల ముందు బిజేపిలో ఉండే నాయకులు…టిడిపి లేదా వైసీపీల్లోకి వచ్చేయడం ఖాయమనే తెలుస్తోంది.

ఇదే క్రమంలో సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ సైతం సైకిలెక్కే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. కృష్ణా జిల్లా కైకలూరు నియోజకవర్గానికి చెందిన కామినేని…గతంలో టిడిపిలోనే పనిచేశారు. ఆ తర్వాత ప్రజారాజ్యంలోకి వెళ్ళి, నెక్స్ట్ బిజేపిలోకి వచ్చేశారు. ఇదే క్రమంలో 2014లో టిడిపితో పొత్తులో భాగంగా కామినేని కైకలూరు నుంచి బిజేపి తరుపున నిలబడి మంచి మెజారిటీతో గెలిచారు.

అలాగే చంద్రబాబు క్యాబినెట్‌లో వైద్యారోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు. కానీ 2018లో టిడిపితో పొత్తు విడిపోవడంతో కామినేని మంత్రి పదవికి రాజీనామా చేసేశారు. అయితే 2019 ఎన్నికల ముందు ఈయన టిడిపిలోకి రావడానికి ప్రయత్నించినట్లు కథనాలు కూడా వచ్చాయి. కానీ కామినేని టిడిపిలోకి రాలేదు. అలా అని బిజేపి తరుపున పోటీ చేయలేదు. ఎన్నికల తర్వాత కూడా కామినేని బిజేపిలో కంటిన్యూ అవుతున్నారు.

అలా అని బిజేపిలో కొనసాగుతున్న కూడా ఏనాడూ చంద్రబాబుపై ఒక్క విమర్శ చేయలేదు. పైగా టిడిపికి బ్యాగ్రౌండ్‌లో కామినేని పనిచేస్తున్నారనే వాదన ఉంది. అందుకే ఈయన పలు అంశాల్లో జగన్ ప్రభుత్వంపై పోరాటం కూడా చేస్తూ వస్తున్నారు. మాజీ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంలో జగన్‌కు వ్యతిరేకంగా కోర్టులో కేసులు కూడా వేశారు. ఇలా జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కామినేని పోరాడుతున్నారు. అలాగే చంద్రబాబుతో ఇప్పటికీ సత్సబంధాలు కొనసాగిస్తున్నారని తెలుస్తోంది. కాబట్టి వచ్చే ఎన్నికల ముందు కామినేని సైకిలెక్కే అవకాశాలు ఉన్నాయని టాక్.

Discussion about this post