ఏపీ రాజకీయాలు కులాల ఆధారంగానే నడుస్తాయనే సంగతి తెలిసిందే. ఇక్కడ రాజకీయ పార్టీలు కులాలని బేస్ చేసుకునే ప్రత్యర్ధులని దెబ్బకొట్టడానికి చూస్తాయి. అలాగే ఇక్కడున్న ప్రధాన పార్టీల్లో కొన్ని కులాల ఆధిపత్యం కూడా ఉందనే సంగతి తెలిసిందే. ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీలో రెడ్డి వర్గం డామినేషన్ ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత రెండేళ్లుగా ఆ పార్టీలో ఎంతమంది రెడ్డి నాయకులకు పదవులు దక్కాయో కూడా తెలుసు.
కానీ అవేమీ పట్టించుకోకుండా జగన్ కులాలకు అతీతంగా పనిచేస్తున్నారని, కావాలనే టీడీపీకి చెందిన కమ్మ వాళ్ళు జగన్‌పై ఏడుస్తున్నారని చెప్పి ఓ బ్లూ మీడియా కథనాలు వేస్తుందని తెలుగు తమ్ముళ్ళు ఫైర్ అవుతున్నారు. అసలు జగన్‌కు కులపిచ్చి లేదని, కులపిచ్చి ఫుల్‌గా ఉన్న ఆ బ్లూ మీడియా చెప్పడం విడ్డూరంగా ఉందని అంటున్నారు. సోషల్ మీడియాలో కొందరు కమ్మ కుర్రవాళ్లు రాష్ట్రంలో రెడ్డి రాజ్యం నడుస్తుందని అంటున్నారని, వారంతా టెర్రరిస్టుల కంటే ఘోరంగా ఉన్నారని బ్లూ మీడియా మాట్లాడటం ఏ మాత్రం సమంజసం కాదని చెబుతున్నారు.
రాజకీయంగా విమర్శలకు కౌంటర్లు ఇవ్వొచ్చు గానీ, టెర్రరిస్టులు, ఉగ్రవాదులు అని మాట్లాడటం అలాంటి బ్లూ మీడియాలకే చెల్లుతుందని తమ్ముళ్ళు ఫైర్ అయిపోతున్నారు. అయినా ఏపీలో నడిచేది రెడ్డి రాజ్యమే అని అందులో ఏ మాత్రం అనుమానం లేదని, ఆఖరికి న్యాయ స్థానాల తీర్పులని ధిక్కరిస్తున్న ఈ ప్రభుత్వం ఏ రాజ్యాంగం అమలు చేస్తుందో ప్రజలకు తెలుసని చెబుతున్నారు.
అయినా ఎదుటవాళ్ళ కులపిచ్చి గురించి, రెడ్డి వర్గానికి చెందిన బ్లూ మీడియా మాట్లాడటం ప్రపంచంలో ఎనిమిదవ వింత అని అంటున్నారు. జగన్ ప్రభుత్వం వచ్చాక ఎంతమంది రెడ్లకు పదవులు వచ్చాయో, పార్టీలో వారికి తప్ప మిగిలిన వారి పరిస్తితి ఎలా ఉంటుందో కూడా ఆ బ్లూ మీడియాకు తెలుసని, అయినా సరే తమ కులగజ్జిని ఆ మీడియా బాగానే ప్రదర్శిస్తుందని టీడీపీ శ్రేణులు కౌంటర్లు ఇస్తున్నాయి.
Discussion about this post