ఏపీలో ఇప్పుడుప్పుడే అధికార వైసీపీపై వ్యతిరేకత పెరుగుతున్నట్లు పలు సర్వేలు చెబుతున్నాయి. అయితే ఇలాంటి సమయంలోనే టిడిపి నేతలు దూకుడుగా పనిచేస్తూ, వైసీపీకి ధీటుగా రావాల్సిన అవసరముంది. కానీ కొందరు టిడిపి నేతలు ఎన్నికలు ఇప్పుడే లేవుగా అని కాస్త నిర్లక్ష్యంగా ఉంటూ, యాక్టివ్‌గా పనిచేయడం లేదు. అలా సరిగ్గా పనిచేయకపోవడం వల్ల వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉన్నా సరే అది టిడిపికి ఏ మాత్రం ప్లస్ కావడం లేదు.

ముఖ్యంగా టిడిపికి కంచుకోటగా ఉన్న కృష్ణా జిల్లాలో ఇంకా పలువురు టిడిపి నేతలు దూకుడుగా పనిచేయాల్సిన అవసరముంది. టిడిపిలో దూకుడుగా పనిచేయని వారిలో మొదట పామర్రు టిడిపి ఇంచార్జ్ ఉప్పులేటి కల్పన ఉన్నారు. అసలు ఓడిపోయాక ఈమె సరిగ్గా ఒక్కరోజు కూడా పార్టీ కోసం పూర్తి స్థాయిలో ఫైట్ చేసినట్లు కనిపించలేదు. అసలు పామర్రు వైసీపీ ఎమ్మెల్యేపై వ్యతిరేకత ఉందని పలు సర్వేలు చెబుతున్నా సరే, ఆ వ్యతిరేకతని ఉపయోగించుకోలేని స్థితిలో కల్పన ఉన్నారు.

ఇక అవనిగడ్డలో మండలి బుద్ధప్రసాద్ అంతగా యాక్టివ్‌గా పనిచేయడం లేదు. దీని వల్ల ఆ నియోజకవర్గంలో టిడిపి ఇంకా వీక్‌గా కనిపిస్తోంది. అటు గుడివాడ, గన్నవరం నియోజకవర్గాల్లో టిడిపి ఇంచార్జ్‌లు బాగా వీక్‌గా కనిపిస్తున్నారు. రావి వెంకటేశ్వరరావు, బచ్చుల అర్జునుడులు అంత ఎఫెక్టివ్‌గా పనిచేయడం లేదు. ఇటు విజయవాడ వెస్ట్‌లో జలీల్ ఖాన్ యాక్టివ్‌గా లేరు. అసలు నెక్స్ట్ ఈ సీటు ఎవరికి వస్తుందో క్లారిటీ లేదు.

నూజివీడులో ముద్దరబోయిన వెంకటేశ్వరరావు, తిరువూరులో దేవదత్, పెడనలో కాగిత కృష్ణప్రసాద్, కైకలూరులో జయమంగళ వెంకటరమణలు ఇంకా దూకుడు పెంచాలసిన అవసరం ఉంది. అంటే జిల్లాలో 16 నియోజకవర్గాలు ఉంటే దాదాపు 9 నియోజకవర్గాల్లో టిడిపి బలపడాల్సిన అవసరం కనిపిస్తోంది.

Discussion about this post