గత ఎన్నికల్లో జగన్ వేవ్‌లో టీడీపీకి కీలకంగా ఉన్న కృష్ణా జిల్లాలో పలువురు కమ్మ నేతలు ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఊహించని విధంగా ఆ నాయకులు ఓటమి పాలయ్యారు. అలా ఓడిపోయిన నేతలు ఇప్పుడుప్పుడే నిదానంగా పుంజుకున్నట్లు తెలుస్తోంది. కానీ ఒక్క నాయకుడు మాత్రం ఇంకా రేసులో వెనుకబడి ఉన్నారని తెలుస్తోంది. మరి ఆ పుంజుకున్న నాయకులు ఎవరో? రేసులో వెనుకబడిన కమ్మ నేత ఎవరో ఒక్కసారి చూద్దాం.
గత ఎన్నికల్లో కృష్ణా జిల్లాలో ఐదుగురు కమ్మ నేతలు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేశారు. మైలవరంలో దేవినేని ఉమా, పెనమలూరులో బోడే ప్రసాద్, విజయవాడ తూర్పులో గద్దె రామ్మోహన్, గన్నవరంలో వల్లభనేని వంశీ, గుడివాడలో దేవినేని అవినాష్‌లు పోటీ చేశారు. ఇందులో వంశీ, గద్దెలు ఎమ్మెల్యేలుగా గెలిచారు. మిగిలిన ముగ్గురు ఓటమి పాలయ్యారు. ఇక వంశీ, దేవినేని అవినాష్‌లు వైసీపీ వైపుకు వెళ్ళిపోయారు.అయితే మిగిలిన నేతలు టీడీపీ తరుపున బాగానే పనిచేస్తున్నారు. ఎమ్మెల్యేగా గద్దె రామ్మోహన్ మంచిగానే పని చేసుకుంటూ, ముందుకెళుతున్నారు. అటు మైలవరంలో దేవినేని ఉమా దూకుడుగా ఉంటూ, పార్టీ తరుపున నిత్యం కష్టపడుతూనే ఉన్నారు. ఎప్పటికప్పుడు పార్టీని చూసుకుంటూనే, అధికార వైసీపీపై, స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతున్నారు. అటు పెనమలూరులో బోడే ప్రసాద్ కూడా అలాగే ముందుకెళుతున్నారు. దీంతో ఈ ఇద్దరు కమ్మ నేతలు చాలా వరకు పుంజుకున్నట్లు తెలుస్తోంది.
స్థానిక వైసీపీ ఎమ్మెల్యేల మీద ఉన్న వ్యతిరేకిత వీరికి కలిసొస్తుంది. అటు గన్నవరంలో వంశీ వెళ్లిపోవడంతో అక్కడ టీడీపీ ఇన్‌చార్జ్‌గా బీసీ వర్గానికి చెందిన బచ్చుల అర్జునుడుని పెట్టారు. ఇక గుడివాడలో అవినాష్ వెళ్లిపోయాక మళ్ళీ రావి వెంకటేశ్వరరావునే ఇన్‌చార్జ్‌గా పెట్టారు. ప్రస్తుతం ఈయన ఒక్కడే టీడీపీలో వెనుకబడి ఉన్నారని తెలుస్తోంది. అందుకే గుడివాడలో టీడీపీ ఇంకా పుంజుకోలేదు.
Discussion about this post