రాజకీయాల్లో ఎప్పుడు విమర్శలు అనేవి హద్దులు దాటకూడదు. ఏ నాయకుడైన…ప్రత్యర్ధులపై నిర్మాణాత్మకమైన విమర్శలు చేయాలి. అలా కాకుండా నోరు వేసుకుని పడిపోయి, బూతులు తిడితే ప్రజలు కూడా సహించే పరిస్తితిలో ఉండరు. అలా బూతులు మాట్లాడే నాయకులకు ఎప్పుడొకప్పుడు బుద్ధి చెప్పడం ఖాయమనే చెప్పొచ్చు. అయితే ఏపీ మంత్రి కొడాలి నానికి సైతం ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరపడ్డాయని టీడీపీ విమర్శిస్తుంది.

నాని అధికారంలోకి వచ్చి, మంత్రి అయ్యాక ఏ స్థాయిలో చంద్రబాబు, లోకేష్‌లపై విమర్శలు చేస్తున్నారో చెప్పాల్సిన పని లేదు. తనదైన శైలిలో బూతులతో విరుచుకుపడుతున్నారు. ఏదైనా అంశాల వారీగా విమర్శలు చేయొచ్చు…లేదా విమర్శలకు కౌంటర్లు ఇవ్వొచ్చు. కానీ నాని పరుషమైన పదజాలంతో చంద్రబాబు, లోకేష్‌లని దూషిస్తారు. ఇక ఆయన మాటలు ఎలా ఉంటాయో రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసు. అందుకే ఆయన్ని టీడీపీ నేతలు బూతుల మంత్రి అంటూ విమర్శిస్తున్నారు.ఇలా చంద్రబాబు, లోకేష్‌లపై విరుచుకుపడే నానికి టీడీపీ గట్టిగానే కౌంటర్లు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే నాని మాట్లాడే మాటలకు టీడీపీ నేతలు తట్టుకోలేకపోతున్నారో లేక..ముల్లుని ముల్లుతోనే తీయాలని అన్నట్లుగా నానికి కూడా బూతులతోనే సమాధానం చెప్పాలని అనుకున్నారో తెలియదు గానీ, ఈ మధ్య కొందరు టీడీపీ నేతలు సైతం, నానిపై విరుచుపడుతున్నారు. నానికి అవే బూతులతో సమాధానం ఇస్తున్నారు.

ఇక మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అయితే..ఓ అడుగు ముందుకేసి….తాము అధికారంలోకి వచ్చిన గంటలోనే…అంకుశం సినిమాలో హీరో రాజశేఖర్…విలన్ రామిరెడ్డిని బట్టలు ఊడదీసి రోడ్డు మీద కొట్టుకుంటూ వెళ్ళినట్లు, నానీని సైతం రోడ్డు మీద కొట్టుకుంటూ తీసుకెళ్లే రోజులు వస్తాయని అన్నారు. అధికారంలోకి రాగానే వడ్డీతో సహ చెల్లిస్తామని, బూతులు మాట్లాడే వైసీపీ నాయకులని రోడ్డుపై పడేసి కొడతామని కామెంట్ చేశారు. అయితే నాని మాట్లాడే బూతులకు విరక్తి వచ్చేసి యరపతినేని ఈ కామెంట్ చేసి ఉంటారని, నెక్స్ట్ తమ పార్టీ అధికారంలోకి వస్తే వైసీపీ నేతలకు చుక్కలే అని టీడీపీ శ్రేణులు మాట్లాడుతున్నాయి. మరి చూడాలి నెక్స్ట్ అధికారం మారితే పరిస్తితి ఎలా ఉంటుందో?
Discussion about this post