ఏపీ కేబినెట్లో కమ్మ సామాజిక వర్గం నుంచి ఏకైక ప్రతినిధిగా ఉన్న కొడాలి నాని కొద్ది రోజులుగా జగన్ తీరుపై అలకతో ఉన్నారా ? టీడీపీ, చంద్రబాబు, లోకేష్‌పై తీవ్రమైన పదజాలంతో విరుచుకు పడే నానిలో మునుపటి స్పీడ్ ఎందుకు తగ్గింది ? పార్టీలో, ప్రభుత్వంలో తనకు ప్రయార్టీ తగ్గడంతో నాని కూడా కాస్త సైలెంట్ అయ్యారా ? అంటే వైసీపీ వర్గాల్లోనే ఈ ప్రశ్నలకు అవును అన్న ఆన్సర్లు వినిపిస్తున్నాయి. జగన్‌ను ఎవరైనా ఏదైనా అంటే కొడాలి నాని ఏ మాత్రం లెక్క చేయరు. వెంటనే ప్రెస్ మీట్ పెట్టి తీవ్రమైన పదజాలంతో విరుచుకు పడుతూ ఉంటారు. మరి అలాంటి నాని వాయిస్ లో స్పీడ్ ఎందుకు తగ్గింది ? ఆ మునుపటి జోరు ఏమైంది అన్న ప్రశ్నలకే అనేక సందేహాలు తలెత్తు తున్నాయి.

కృష్నా జిల్లాకే చెందిన మాజీ మంత్రి దేవినేని ఉమా అరెస్టు వ్యవహారం ఏపీ రాజకీయాలను ఓ ఊపు ఊపేసింది. అయితే అదే జిల్లా నుంచి మంత్రిగా ఉన్న కొడాలి నాని ఏదో తూతూ మంత్రంగా ప్రెస్ మీట్ పెట్టారే తప్పా అందులో ఉమా, చంద్రబాబును పెద్దగా విమర్శించింది లేదు. ఉమా నానికి చిరకాల రాజకీయ శత్రువు. వారిద్దరు టీడీపీలో ఉన్నప్పటి నుంచే బద్ధ శత్రువులు. చివరకు ఉమా విషయంలో స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాదే కౌంటర్ ఇచ్చుకున్నారు.

ఏపీ ప్రభుత్వ అప్పుల విషయంలో విపక్షాలు పెద్ద ఎత్తున రాద్దాంతం చేస్తున్నాయి. మంత్రులు ఎవ్వరూ స్పందించడం లేదు. చివరకు సజ్జల ఓ ప్రెస్ మీట్ పెట్టి తన బాధ తాను చెప్పుకుంటున్నారు. మరో వైపు అటు అమరరాజా బ్యాటరీ పై టార్గెట్ చేయడం… ఇటు ఉమాను అరెస్టు చేయడంతో మళ్లీ కమ్మ కులాన్ని టార్గెట్ చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు ఆ వర్గం మంత్రిగా ఉన్న నాని ఆ స్థాయిలో రీ సౌండ్ ఎందుకు చేయడం లేదో ? అర్థం కావడం లేదు.

ఇక ఇటీవల నామినేటెడ్ పదవుల్లోనూ కమ్మలకు మూడు, నాలుగు పదవులు మాత్రమే వచ్చాయి. వైసీపీలో ఉన్న కమ్మల్లో కూడా తీవ్ర అసంతృప్తి రగులుతోంది. దీంతో పాటు వచ్చే ప్రక్షాళనలో మర్రి రాజశేఖర్‌కు ఇచ్చిన హామీ కోసం నానిని పక్కన పెడతారని కూడా టాక్ ? ఇవన్నీ తెలిసే నాని మౌనమునిగా మారారని అంటున్నారు. అందుకే అటు జగన్ విషయంలో పైకి ఏదో భజన చేస్తున్నా లోపల మాత్రం అసంతృప్తితోనే ఉన్నట్టు భోగట్టా ?
Discussion about this post