జగన్ తన రూటే సెపరేట్ అంటారు. ఆయనకు ఒకరు చెప్పేది ఉండదు, చెప్పినా ఆయన వినరు అన్న మాట కూడా ఉంది. ఇక జగన్ తాను తలచుకున్నది అలా చేసుకుని పోతారు. జగన్ తాను పాదయాత్ర సమయంలోవివిధ వర్గాలకు హామీలు చాలా ఇచ్చారు. ఇపుడు వాటిని అమలు చేసే పనిలోనే ఆయన బిజీగా ఉన్నారు. రూపాయి ఆదాయం ఖజానాకు వస్తే చాలు సంక్షేమ క్యాలండర్ ని చకచకా అమలు చేసుకుని పోతున్నారు. మరో వైపు చూసుకుంటే సమాజంలో పధకాల ద్వారా లబ్ది పొందుతున్న వారిని పక్కన పెడితే మిగిలిన సెక్షన్లు చాలా ఉన్నాయి. కానీ జగన్ కి వారి విషయం అసలు పట్టడంలేదు.
ఇక ప్రభుత్వ ఉద్యోగులు అయితే జగన్ పోకడల మీద పెద్ద ఎత్తున మండిపోతున్నారు. వారికి 2018 నుంచి డీఏలు అన్నవి అసలు ఇవ్వలేదు. అలాగే పీయార్సీ ఊసు లేదు. ఇక జీతాలు కూడా ఎపుడు వస్తాయో అన్నది ఎవరికీ తెలియదు. దఫదఫాలుగా దశలవారీగా జీతాలు ఇచ్చుకుంటూ పోతున్నారు. దీంతో జగన్ వస్తే తమ దశ తిరిగిపోతుంది అని పంతం పట్టి మరీ వైసీపీని గెలిపించిన ఉద్యోగులు కక్కలేక మింగలేక అన్నట్లున్నారు. చిత్రమేంటి అంటే వారి చేతుల మీదనే ఈ పంచుడు కార్యక్రమం సక్సెస్ ఫుల్ గా అమలు జరుగుతోంది. దాంతో వారి ఇంకా మండిపోతున్నారు.తమకు సక్రమంగా జీతాలు ఇవ్వాలంటే ప్రభుత్వానికి చేతులు రావడంలేదు కానీ వందల కోట్లు పెట్టు ఆ పధకం ఈ పధకం అంటూ క్యాలండర్ ఒకటి పెట్టి డేట్ టైమ్ చూసుకుని మరీ పంచేస్తున్నారు అని తెగ బాధపడిపోతున్నారు. ఇలా పంచిన వారే ఓట్లేస్తారు, వారితోనే తాను గెలిచిపోతాను అని జగన్ అనుకుంటే కుదరదు అని కూడా వారు అంటున్నారు. తామూ ఓటర్లమేనని , తాము వెరీ పవర్ ఫుల్ అని కూడా వారు చెబుతున్నారు.
మరి చరిత్రలో చూస్తే ఉద్యోగులతో పెట్టుకున్న ఏ సర్కార్ అయినా మునిగిపోయింది. జగన్ కి ఆ సంగతి తెలుసో లేదో, లేక ఆయనకు ఉద్యోగుల ఆక్రందనలు వినిపిస్తున్నాయో లేదో కానీ కొరివితోనే తలగోక్కుంటున్నారు అంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను జగన్ నెరవేర్చాలి అంటున్నారు. లేకపోతే ముందుంది అసలైన ముప్పు అని కూడా చెప్పేస్తున్నారు.
Discussion about this post