నామినేటెడ్ పదవుల కోసం అధికార వైసీపీ నాయకులు ఎందరో ఆశలు పెట్టుకున్నారు. ఎప్పుడు నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తారా అని ఎదురుచూస్తూ వచ్చారు. అదిగో… ఇదిగో నామినేటెడ్ పోస్టుల భర్తీకి ముహూర్తం ఖరారైందంటూ ఆ పార్టీ పెద్దలు ఆశావహుల్లో ఆశలు రేపుతూ కాలయాపన చేస్తూ వచ్చా రు. ఈ నెల ఆరంభంలోనే పోస్టులు భర్తీ చేస్తామనే ప్రచారం సాగినప్పటికీ పక్షం రోజులు ఆలస్యంగానైనా నామినేటెడ్ పదవుల జాబితాను విడుదల చేశారు. ఆవిర్భావం నుంచి పార్టీ కోసం పనిచేస్తున్న నేపథ్యంలో తమకు తప్పనిసరిగా నామినేటెడ్ పదవి దక్కుతుందని చెప్పుకుంటూ వచ్చిన ఆ పార్టీ నేతల్లోని కొందరు కంగుతినేలా పదవుల పం పకాలు ఉండటంతో ఆ వర్గాలు తీవ్ర అసంతృప్తికి లోనైనట్లు సమాచారం.
వైఎస్ కుటుంబానికి వెన్నంటి నడిచిన నేతలకు నామినేటెడ్ పదవుల పంపకాల్లో మొండిచేయి చూపారన్న గుసగుసలు వినిపిస్తు న్నాయి. నామినేటెడ్ పదవులను భర్తలు ఆశిస్తే.. భార్యలకు అవకాశం కల్పించడమూ కొంత విస్మయానికి గురిచేస్తోందన్న అభిప్రా యం ఆ పార్టీ నేతల్లో లేకపోలేదు. ఏదేమైనప్పటికీ నామినేటెడ్ పదవులు ఆ పార్టీలోని నేతల్లో కొందరికి మోదం.. మరికొందరికి ఖేదం కలిగించాయి. ముఖ్యంగా ఇప్పుడు 55 శాతం మంది మహిళలకు పార్టీ తరఫున పగ్గాలు దక్కినా.. చక్రం తిప్పేది మాత్రం వారి భర్తలే అనే టాక్ వినిపిస్తోంది. ఇది పార్టీకి మేలు చేయకపోగా.. నష్టం వాటిల్లేలా చేస్తుందనే ఊహాగానాలు కూడా ఉన్నాయి.
కీలకమైన పదువులై.. డీసీసీబీ పదవుల్లో మహిళలకు అవకాశం కల్పించారు. వాస్తవానికి ఇలాంటి పదవులు దక్కించుకోవా లంటే.. కనీసం ఎంతో కొంత చదివి ఉండాలి. కానీ, ఇప్పుడు నామినేట్ అయిన 68 మంది మహిళ్లలో దాదాపు 15 మందికి క్వాలిఫికేషన్ లేదు. ఇలాంటివారు సంతకాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉందని పార్టీలోనే గుసగుస వినిపిస్తోంది. ఇలాంటి తరుణంగా వారి భర్తలే అంతా అయి.. వ్యవహరిస్తారనే టాక్ వినిపిస్తోంది.ఇదే జరిగితే.. ఇటు ప్రతిపక్షాలు, అటు ప్రభుత్వ వ్యతిరేక మీడియా కూడా చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు. ఎన్నికల ముందు, దీనిని ప్రచారం చేసే అవకాశం ఉందని అంటున్నారు. సో..మహిళలకు అవకాశం ఇచ్చినా.. చదువుకున్న వారికి ఇచ్చి ఉంటే బాగుండేదనే టాక్‌తోపాటు.. పార్టీలో ముందు నుంచి ఉన్న వారికి ప్రాధాన్యం ఇచ్చి ఉంటే బాగుండేదనే సూచనలు కూడా వస్తున్నాయి.
Discussion about this post