విశాఖపట్నం జిల్లా తెలుగుదేశం పార్టీలో నాయకులకు కొదవ లేదు. జిల్లాలో టిడిపికి బలమైన నాయకులు ఉన్నారు. అందుకే గత ఎన్నికల్లో ఓడిపోయినా సరే పార్టీ ఇంకా స్ట్రాంగ్‌గా ఉంది. స్ట్రాంగ్‌గా ఉన్న పార్టీని వీక్ చేయడానికి అధికార వైసీపీ ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూనే ఉంది. ఇక అధికార పార్టీ వ్యూహాల్లో భాగంగా విశాఖలో కొందరు టిడిపి నాయకులు సైలెంట్ అవుతూ వచ్చారు. పైగా భూ కబ్జా ఆరోపణలు, అక్రమ కట్టడాలంటూ టిడిపి నేతలని వైసీపీ బాగానే ఇబ్బంది పెడుతూ వస్తుంది. అందుకే వైసీపీపై పోరాటం చేయాలసిన నాయకులు కాస్త సైలెంట్ అయిపోయారు.

కొందరు నాయకులైతే వైసీపీలోకే వెళ్ళిపోయారు. అయితే సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు సైతం అసలు రాజకీయాల్లోనే కనిపించడం లేదు. ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉండి అధికార పక్షంపై పోరాటం చేయడం లేదు. పైగా ఈయన విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసి, సైలెంట్‌గా ఉంటున్నారు.ఇప్పటికే గంటా పార్టీ మారిపోతారని అనేక సార్లు ప్రచారం జరిగింది. కానీ ఆయన పార్టీ మారలేదు. అలా అని టిడిపిలో యాక్టివ్‌గా లేరు. అటు గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు అండగా ఉండటం లేదు.
ఇక ఇదే వరుసగాలో విశాఖ వెస్ట్ ఎమ్మెల్యే గణబాబు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మొదట నుంచి గంటాని ఫాలో అయ్యే గణబాబు, ఇప్పుడు కూడా అలాగే ముందుకెళుతున్నట్లు కనబడుతోంది. పేరుకు టిడిపి ఎమ్మెల్యేగా ఉన్నారు గానీ, అందుకు తగ్గట్టుగా మాత్రం పనిచేయడం లేదు.

విశాఖలో మిగతా టిడిపి నాయకులు వైసీపీపై పోరాటం చేస్తున్నా కూడా గణబాబు..తనకు పార్టీతో సంబంధం లేదన్నట్లుగానే ముందుకెళుతున్నారు. అంటే టిడిపి అధికారంలో లేదని చెప్పి గంటా, గణబాబులు సేఫ్‌గా రాజకీయం చేస్తున్నట్లు ఉందని కొందరు తెలుగు తమ్ముళ్ళు చర్చించుకుంటున్నారు. మళ్ళీ టిడిపి అధికారంలోకి వస్తే వీరు ఎలా ఉంటారో చూడాలని అంటున్నారు.
Discussion about this post