గన్నవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పరిస్తితి బాగోలేదా? ఆయనపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుందా? అంటే తాజాగా వస్తున్న కొన్ని సర్వేలని బట్టి చూస్తే అవుననే చెప్పొచ్చు. రీసెంట్‌గా ఆత్మసాక్షి గ్రూపు పేరుతో వచ్చిన సర్వేలో 9 మంది టీడీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత వచ్చిందని…అంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఆ 9 మంది ఓడిపోయే అవకాశాలున్నాయని చెప్పింది. అయితే గత ఎన్నికల్లో టీడీపీ తరుపున 23 మంది ఎమ్మెల్యేలు గెలిచారు.

ఆ 23 మందిలో 9 మందిపై వ్యతిరేకత వచ్చింది. అంటే వైసీపీలోకి జంప్ అయిన నలుగురు ఎమ్మెల్యేలని కూడా టీడీపీ ఎమ్మెల్యేలుగానే పరిగణించి ఆ సర్వే బయటకొచ్చింది. ఇక 9 మందిలో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కూడా ఉన్నారు. గత రెండు ఎన్నికల్లో వరుసగా టీడీపీ తరుపున ఎమ్మెల్యేగా గెలిచిన వంశీ, వైసీపీలోకి వెళ్ళిన విషయం తెలిసిందే. అధికారికంగా వైసీపీలో చేరకుండా, జగన్ ప్రభుత్వానికి మద్ధతుగా నిలిచారు. అంటే అనధికారికంగా వంశీ వైసీపీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.

అయితే గన్నవరంలో వంశీపై వ్యతిరేకత వచ్చినట్లు ఆ సర్వే చెబుతోంది. అంటే అక్కడి ప్రజలు వంశీ పనితీరు పట్ల అసంతృప్తిగా ఉన్నారని అంటుంది. కానీ ఇక్కడ విషయం ఏంటంటే వంశీకి గన్నవరంలో కాస్త ఫాలోయింగ్ ఎక్కువే ఉంది. పైగా అధికార పార్టీలో ఉన్నారు. అలాంటప్పుడు ప్రజలకు మరింతగా పనులు చేసే పెట్టే అవకాశం ఉంది.

కానీ అధికార పార్టీలో ఉన్నా సరే అనుకున్న మేర నిధులు అందక పనులు జరుగుతున్నట్లు కనిపించడం లేదని పరిశీలకులు చెబుతున్నారు. టీడీపీ అధికారంలో ఉండగా అనుకున్న మేర కొంత పనులు జరిగాయని, ఇప్పుడు అయితే మరి కష్టంగా ఉందని అంటున్నారు. పైగా జగన్ ప్రభుత్వం పథకాల పేరుతో ప్రజలకు ఒక రూపాయి వచ్చి, పన్నుల పేరుతో పది రూపాయలు లాగేస్తుంది. ఇంకా చాలా అంశాల్లో ప్రభుత్వంపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు. ఇవే అంశాలు ఇప్పుడు వంశీకి నెగిటివ్ అవుతున్నాయని చెబుతున్నారు. పైగా వంశీ పార్టీ మారడం కూడా కాస్త మైనస్ అయినట్లే కనిపిస్తోంది. మొత్తానికైతే గన్నవరంలో వంశీపై వ్యతిరేకత ఉందని సర్వే చెబుతోంది.
Discussion about this post