గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్న నియోజకవర్గాలు చాలానే ఉన్నాయి. కానీ టీడీపీకి అసలు కలిసిరాని నియోజకవర్గాల్లో మాచర్ల ముందు వరుసలో ఉంటుంది. ఇక్కడ టీడీపీ చివరిసారిగా గెలిచింది 1999 ఎన్నికల్లోనే…ఆ తర్వాత నుంచి ఇక్కడ టీడీపీ గెలవలేదు. 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవగా, 2012 ఉపఎన్నిక, 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించింది. వరుసగా వైసీపీ తరుపున పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విజయం సాధిస్తూ వస్తున్నారు.

అయితే పిన్నెల్లికి టీడీపీ ఏ మాత్రం చెక్ పెట్టలేకపోతుందనే చెప్పొచ్చు. పైగా మాచర్లలో స్టాండర్డ్‌గా ఒక్క నాయకుడు ఉండరు. ఒక ఎన్నికలో పోటీ చేసిన అభ్యర్ధి మరో ఎన్నికలో ఉండరు. మొదట నుంచి మాచర్లలో టీడీపీది అదే వరుస. 2014 ఎన్నికల్లో పిన్నెల్లి మీద కొమ్మారెడ్డి చలమారెడ్డి పోటీ చేసి ఓడిపోగా, 2019 ఎన్నికల్లో ఆయన పక్కనబెట్టి అంజిరెడ్డికి సీటు ఇచ్చారు. ఇక ఆయన కూడా ఓడిపోయారు.మళ్ళీ ఇప్పుడు నియోజకవర్గ బాధ్యతలు చలమారెడ్డికి అప్పగించారు. అసలు ఇక్కడ టీడీపీకి మామూలుగానే బలం లేదు. పైగా అభ్యర్ధులని నిలకడగా ఉంచడం లేదు. దీంతో మాచర్లలో టీడీపీకి భవిష్యత్ కనిపించడం లేదు. దీనికితోడు మాచర్లలో పిన్నెల్లి బాగా స్ట్రాంగ్ అయిపోయారు. పైగా ఆయన దెబ్బకు నియోజకవర్గంలో టీడీపీ జెండానే కనిపించడం లేదు.

గతంలో స్థానిక ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ తరుపున నామినేషన్స్ వేయడానికే అభ్యర్ధులు ముందుకురాలేదు. ఇక అక్కడ టీడీపీ చేత నామినేషన్స్ వేయించడానికి వెళ్ళిన బుద్దా వెంకన్న, బోండా ఉమాల పరిస్తితి ఏమైందో అంతా చూశారు. అంటే అక్కడ వైసీపీ తప్ప మరో పార్టీ ఉండకూడదనే విధంగా పాలన జరుగుతుంది. ఇక అలాంటి పరిస్తితుల్లో మాచర్లలో మళ్ళీ టీడీపీ పుంజుకోవడం, గెలవడం గగనమే. ఇప్పటిలో మాచర్లలో టీడీపీ గెలిచేలా కనిపించడం లేదు.
Discussion about this post