గత ఎన్నికల్లో గుంటూరు జిల్లాలో వైసీపీ డామినేషన్ కొనసాగిన విషయం తెలిసిందే. జిల్లాలో 17 సీట్లు ఉంటే 15 వైసీపీనే గెలుచుకుంది. రాజధాని అమరావతి ఎఫెక్ట్ ఏ మాత్రం టీడీపీకి వర్క్ అవ్వలేదు. ఆ పార్టీ కేవలం రెండు సీట్లే గెలుచుకుంది. అందులో ఒక ఎమ్మెల్యే మళ్ళీ వైసీపీ వైసీపీ వైపుకు వెళ్ళిపోయారు.అయితే అధికారంలోకి వచ్చాక వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతో అమరావతికి షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో అక్కడి ప్రాంత ప్రజలు ఉద్యమబాట పట్టారు. అమరావతిని కాదన్న సరే అక్కడి ప్రజలు స్థానిక ఎన్నికల్లో వైసీపీని రికార్డు స్థాయిలో గెలిపించారు. వైసీపీ అధికారంలో ఉండటంతోనే ప్రజలు వేరే దారిలేక ఓటు వేసినట్లు తెలుస్తోంది. కానీ సాధారణ ఎన్నికల్లో గుంటూరు ప్రజలు వైసీపీకి చుక్కలు చూపించడం ఖాయమని విశ్లేషణలు వస్తున్నాయి.

పైగా వైసీపీ చేసే అభివృద్ధి కార్యక్రమాలు శూన్యం. పథకాల పేరిట రూపాయి ఇచ్చి, పన్నుల పేరిట పది రూపాయలు లాగేసుకుంటున్నారని ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. అటు వైసీపీ ఎమ్మెల్యేల మీద వ్యతిరేకిత పెరుగుతుంది. పలువురు ఎమ్మెల్యేలు అవినీతి, అక్రమాలు చేయడంలో ముందున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఇదే సమయంలో టీడీపీ నేతలు పుంజుకోవడం ఆ పార్టీకి బాగా అడ్వాంటేజ్ అయిందని తెలుస్తోంది.

వచ్చే ఎన్నికల వరకు టీడీపీ అలాగే కష్టపడితే జిల్లాలో మెజారిటీ సీట్లు కైవసం చేసుకోవడం ఖాయమని విశ్లేషణలు వస్తున్నాయి. ఇక టీడీపీ సత్తా చాటే సీట్లలో తాడికొండ, మంగళగిరి, తెనాలి, పొన్నూరు, గుంటూరు వెస్ట్ నియోజకవర్గాలు ముందు వరుసలో ఉంటాయని తెలుస్తోంది. అలాగే వినుకొండ, పెదకూరపాడు, గురజాల, చిలకలూరిపేట, సత్తెనపల్లి, రేపల్లె, ప్రత్తిపాడు, వేమూరు నియోజకవర్గాల్లో టీడీపీకి అనుకూల ఫలితాలు వస్తాయని తెలుస్తోంది.
Discussion about this post