తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న గుడివాడ నియోజకవర్గాన్ని కొడాలి నాని తన సొంత అడ్డాగా మార్చేసుకున్న విషయం తెలిసిందే. గుడివాడలో నాని తిరుగులేని శక్తిగా ఎదిగిపోయారు. ఈయనకు ప్రతిపక్షాలు చెక్ పెట్టడం చాలా కష్టమైపోయింది. గత రెండు ఎన్నికల్లో టీడీపీ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. వచ్చే ఎన్నికల్లో కూడా అదే పరిస్తితి కొనసాగేలా కనిపిస్తోంది.

ఒకవేళ రాష్ట్రంలో టీడీపీ గాలి ఉన్నా సరే గుడివాడలో మాత్రం కొడాలి హవా తగ్గేలా కనిపించడం లేదు. అంటే గుడివాడలో రాజకీయం అలా ఉందని చెప్పొచ్చు. అయితే టీడీపీ తరుపున బలమైన అభ్యర్ధి ఉంటే పరిస్తితి వేరుగా ఉంటుంది. ఇదే సమయంలో గుడివాడలో జనసేన గానీ బరిలో ఉంటే కొడాలికే ఇబ్బంది అని చెప్పొచ్చు. దానికి కూడా ఒక లాజిక్ ఉంది. గుడివాడలో జనసేనకు గెలిచే సీన్ అసలు లేదు.

కానీ ఆ పార్టీ పోటీలో ఉంటే ఓట్లు చీలిపోయి కొడాలికే డ్యామేజ్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. గత ఎన్నికల్లో జనసేన చాలా నియోజకవర్గాల్లో ఓట్లు చీల్చేసి టీడీపీకి డ్యామేజ్ చేసిన విషయం తెలిసిందే. కానీ గుడివాడలో మాత్రం సీన్ రివర్స్…జనసేన ఓట్లు చీలిస్తే టీడీపీకే బెనిఫిట్. ఎందుకంటే గుడివాడలో పవన్‌ని అభిమానించే కాపు ఓటర్లు ఎక్కువగానే ఉన్నారు. వీరు ఎక్కువగా కొడాలికే సపోర్ట్ చేస్తారు. ఇక్కడ కాపు ఓటర్లు టీడీపీకి పెద్దగా సపోర్ట్ చేయరు.
ఒకవేళ జనసేన బరిలో ఉంటే 10 నుంచి 15 వేల ఓట్లు, ఆ పార్టీకే పడతాయి. ఆ ఓట్లు నానికే మైనస్ అవుతాయి. అందుకే గత ఎన్నికల్లో ఇక్కడ జనసేన అభ్యర్ధిని బరిలో లేకుండా చేశారని టాక్. కానీ వచ్చే ఎన్నికల్లో జనసేన అభ్యర్ధి బరిలో ఉంటే మాత్రం ఓట్లు చీలిపోయి నానికే దెబ్బపడుతుందని అంటున్నారు.

Discussion about this post