మాకు గుర్తింపు కావాలి. ఆ వెంటనే పదవులు కావాలి. పార్టీ అధికారంలోకి వస్తే.. ఏకంగామంత్రి పదవులు కూడా మాకు రావాలి..! ఇదీ.. ఇప్పుడు టీడీపీలో వినిపిస్తున్న మాట. నిజానికి ఈ మాట ఇప్పుడే కాదు.. పార్టీ ఎప్పుడు ప్రతిపక్షంలో ఉంటే.. అప్పుడు ఇలాంటి వివాదాలు కామన్ గా మారిపోయాయి. గతంలోనూ.. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబును ఇలాంటి వ్యూహాలతో చాలామంది నాయకులు ఇబ్బందులు పెట్టారు. అయితే..వీరి వ్యూహాలను పసిగట్టి.తనదైన శైలితో వారిని దారిలోకి తెచ్చుకునే విషయంలో చంద్రబాబు విఫలమవుతూనే ఉన్నారు. దీంతో ఎప్పటికప్పుడు..రెడ్డొచ్చె మొదలు.. అన్న సామెతలా.. టీడీపీలో అసతృప్తుల పర్వం చర్చకు వస్తూనే ఉంది.

వాస్తవానికి ఇప్పుడున్న పరిస్థితిలో టీడీపీకి ఏం కావాలి? ఈ ప్రశ్న కు సమాదానం.. పార్టీని సంఘటితం చేసుకోవడం.. ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి పనిచేయడం.. పార్టీని అధికారంలోకి తీసుకురావడం. వంటివి చాలా ముఖ్యం. అయితే.. ఈ సున్నితమైన అంశాన్ని.. పార్టీ నేతలు పక్కన పెడుతున్నారు.ఎవరికి వారు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటున్నారు. ఎవరికి వారు ఆధిపత్య రాజకీయాలు చేస్తున్నారు. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు.. అంత తిన్నావ్.. ఇంత తిన్నావ్..నన్ను ఎదగనివ్వలేదు.. ఇప్పుడు నీతులు చెబుతున్నావా! అంటూ.. తాజాగా అలకబూనిన ఓ ఎమ్మెల్యే.. ఓ నాయకుడిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు టీడీపీ వ్యతిరేక మీడియాలో ప్రచారంలోకి వచ్చాయి.

ఈ పరిణామం.. నిజంగానే పార్టీ బలహీన పరుస్తోంది. సీనియర్లు ఇలా ఉంటే.. జూనియర్లుగా వీరు చెప్పుకొనే పరుచూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు కానీ, మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు కానీ, బాపట్ల ఇంచార్జ్ వేగేశ్న నరేంద్ర వర్మ, అనంతలో కాల్వ శ్రీనివాసులు ఇలా అనేక మంది ఇతర నేతలు కానీ… ఇలా ఎంత మాత్రం లేరు. వారికి పార్టీ అధినేత అప్పగించిన పనులు చేసుకుంటూ… పోతున్నారు. పార్టీ కోసం బయటకు వస్తున్నారు. ఏదో మొహమాటానికి పార్టీ కోసం మీడియా ముందుకు వచ్చి నాలుగు మాటలు అనేసి వారు తుడిచేసుకోవడం లేదు. మరి ఈ తరహా రాజకీయాలు కావాలా?

లేక.. ఇప్పుడు లేని.. ఎప్పుడు వస్తాయో చెప్పలేని పదవుల కోసం.. ఆరాటం కావాలా? అనేది సీనియర్లు తేల్చుకోవాల్సిన అసవరం ఉందని అంటున్నారు పరిశీలకులు. ఈ విషయంలో పార్టీ ప్రయోజనాలు పరమావధిగా చంద్రబాబు కూడా కఠినంగా వ్యవహరిస్తేనే.. ప్రజల్లో మంచి సంకేతాలు వస్తాయని.. చెబుతున్నారు. అంతేతప్ప.. ప్రతిసారీ ఎదురయ్యే ఈ పరిణామాలను ఉపేక్షించడం.. మొత్తానికే మోసం అనేవి షయాన్ని ఆయన గుర్తించాలని సూచిస్తున్నారు
Discussion about this post