వారసత్వ రాజకీయాలు చేసే వారు చాలా మందే ఉన్నారు. తండ్రి చాటు బిడ్డలుగా, తల్లి చాటు బిడ్డలుగా.. రాజకీయాల్లోకి వచ్చిన వారు ఎంతో మంది ఉన్నారు. కానీ, తమను తాము నిరూపించుకున్నవారు .. ఎంత మంది ఉన్నారు? వ్యక్తిగతంగా చూసుకున్నప్పుడు.. ఎంత మంది తమను తాము ప్రొజెక్టు చేసుకోవడంలో సక్సెస్ అయ్యారు? అంటే.. చెప్పడం కొంచెం కష్టమే అవుతుంది. ఒకప్పుడు ఎంత వారసులుగా వచ్చినా.. ప్రజల మధ్య ఉంటూ.. వారి కష్టాలు తెలుసుకుంటూ.. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉన్న నాయకులు.. కనిపించేవారు.

కానీ, ఇప్పుడు మారిన రాజకీయాల నేపథ్యంలో వారసులు వస్తున్నా.. ప్రజల మధ్య నిలదొక్కుకునేవారు చాలా చాలా తక్కువ మందే ఉంటున్నారు. తమను తాము నిరూపించుకునేందుకు ప్రయత్నించేవారు మరింత తక్కువ మందే ఉన్నారు. ఇలాంటి వారిలో శ్రీకాకుళం జిల్లా టీడీపీ ఇంచార్జ్ గౌతు శిరీష ముందు వరుసలో నిలుస్తారు. గౌత్ లచ్చన్న మనవరాలిగా, శ్యామ్ సుందర్ శివాజీ.. కుమర్తెగా.. ఆమె రాజకీయ అరంగేట్రం చేసినా.. తనకంటూ.. ప్రత్యేకతను సంతరించుకున్నారు. ప్రజల నాయకురాలిగా.. సమస్య ఎక్కడ ఉంటే.. అక్కడ ప్రత్యక్ష మయ్యే నాయకురాలిగా ఆమె గుర్తింపు పొందారు.

శ్రీకాకుళం టీడీపీ ఇంచార్జ్‌గా ఉన్న శిరీష.. పార్టీని అన్ని రూపాల్లోనూ ప్రజల మధ్యకు తీసుకువెళ్లారు. నిరంతరం ప్రజల మద్యే ఉన్నారు. పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కూడా ప్రజలకు చేరువయ్యారు. వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరించే ప్రయత్నం చేశారు. అదేసమయంలో కీలకమైన జిల్లాలో విభిన్న మనస్తత్వాలు ఉన్న నేతలను ఏకతాటిపైకి నడిపించే ప్రయత్నం కూడా చేశారు. ఈ క్రమంలోనే గత ఎన్నికల్లో పలాస టికెట్‌ను సంపాయించుకున్నారు. భారీ ఎత్తున ప్రచారం చేశారు. అయితే.. వైసీపీ సునామీ కారణంగా విజయం తృటిలో తప్పిపోయింది.

అయితే.. రాజకీయాల్లో గెలుపు ఓటములు సర్వసాధారణం కనుక.. ఒక్క పరాజయంతోనే ఏ నేతా కూడా విఫలమైనట్టు కాదు. ఇదే సూత్రాన్ని అవలంభిస్తున్న శిరీష.. తాను నమ్మిన పార్టీ కోసం ఇప్పుడు కూడా శ్రమిస్తున్నారు. జగన్ ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగడుతున్నారు. పార్టీ పిలుపు మేరకు నిర్వహిం చే ప్రతి కార్యక్రమంలోనూ ఆమె పాల్గొంటున్నారు.

ఇది పార్టీలో నూతనోత్తేజం తీసుకువచ్చేందుకు ఎంతో కృషి చేస్తోంది. నిజానికి ఇప్పుడున్న పరిస్థితిలో పార్టీని కాపాడుకోవడం అత్యంత ముఖ్యం. దీనిని గమనించిన శిరీష.. పార్టీ నేతలకు నిత్యం అందుబాటులో ఉంటూ. వారి సమస్యలు పట్టించుకుని ముందుకు సాగుతున్నారు. ఈ పరిణామాలను గమనిస్తున్న వారు.. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా శిరీషదే విజయం ఖాయమని అంటున్నారు.

Discussion about this post