టీడీపీ అధినేత చంద్రబాబుపై సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇటీవల నారప్ప సినిమా రిలీజ్ సందర్బంగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చంద్రబాబు, జగన్‌ల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. సినిమా ఇండస్ట్రీ వారు చంద్రబాబుని తిట్టినట్లుగా, జగన్, వైఎస్సార్‌లని తిట్టలేదని మాట్లాడారు.
ఉదాహరణకు మోహన్ బాబు గతంలో చంద్రబాబుపై విమర్శలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. కానీ ఇండస్ట్రీ వాళ్ళు ఎప్పుడు జగన్, వైఎస్సార్‌లని ఒక్క మాట కూడా అనలేదని అంటున్నారు. అయితే సురేష్ బాబు చేసిన వ్యాఖ్యలు వాస్తవమే అని పలువురు రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఇప్పటివరకు సినిమా వాళ్ళు ఎక్కువగా చంద్రబాబునే టార్గెట్ చేసి మాట్లాడారు.గత ఎన్నికల ముందు అయితే మోహన్ బాబు గానీ, పోసాని కృష్ణ మురళి, పృథ్వీ రాజ్…ఇలా చెప్పుకుంటూ పోతే చిన్నాచితక నటులు కూడా బాబుపై విమర్శలు చేశారు. ఇప్పటికీ కూడా బాబుపై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. అయితే ఇండస్ట్రీలో ఉండే నటులు ఎప్పుడు జగన్, వైఎస్సార్‌లపై విమర్శలు చేసిన సందర్భాలు తక్కువ. పైగా టీడీపీకి అనుకూలంగా ఉండే నటులైన జగన్, వైఎస్సార్‌లని పెద్దగా విమర్శించరు.
కానీ వైసీపీకి అనుకూలంగా ఉండే నటులు చంద్రబాబుపై ఎలాంటి విమర్శలు చేస్తారో చెప్పాలసిన పని లేదు. సమయానికి అనుగుణంగా రాజకీయం చేస్తూ చంద్రబాబుని నెగిటివ్ చేయడానికే చూశారు. అసలు మోహన్ బాబు అయితే ఎన్నికల ముందు రచ్చ అందరికీ తెలుసు. కానీ ఎన్నికలయ్యాక, జగన్ గెలిచాక అడ్రెస్ లేరు. ఏదేమైనా సురేష్ బాబు చెప్పే పాయింట్‌లో నిజం ఉందని అంటున్నారు.
Discussion about this post