గత చంద్రబాబు ప్రభుత్వం అమలు చేసిన పలు పథకాలని జగన్ ప్రభుత్వం ఆపేసిన విషయం తెలిసిందే. అలాగే చంద్రబాబు నిర్మించిన ప్రజావేదిక లాంటి కట్టడాలని కూడా కూల్చేశారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం అమలు చేసినది ప్రతిదీ జగన్ ప్రభుత్వం వద్దు అనుకుంటే, అందుకు కాస్త అర్ధం ఉంటుంది. చంద్రబాబు ప్రభుత్వంలో జరిగిన కొన్ని కార్యక్రమాలని జగన్ తన ఖాతాలో వేసుకుని, ఆ ఘనత తనదే అని చెప్పుకోవడానికి బాగానే ప్రయత్నిస్తున్నారు.
ఇప్పటికే విజయవాడ కనకదుర్గ ఫ్లైఓవర్ లాంటి నిర్మాణాల విషయంలో…ఇది మా ఘనతే అని వైసీపీ నేతలు గొప్పలు చెప్పుకున్న విషయం తెలిసిందే. అలాగే గత చంద్రబాబు ప్రభుత్వ హయంలో ప్రతి పేదవాడికి మంచి ఇల్లు ఉండాలనే లక్ష్యంతో టిడ్కో ఇళ్లని నిర్మించారు. సిటీలకు దగ్గరలో, పెద్ద పెద్ద అపార్ట్‌మెంట్లు నిర్మించారు. అందులో అన్నీ సౌకర్యాలు ఉండేలా ప్రజలకు ఇళ్ళు కట్టించారు. అయితే చంద్రబాబు అధికారంలో నుంచి దిగిపోయేసరికి కొన్ని టిడ్కో ఇళ్ళు నిర్మాణం పూర్తి కాగా, మరికొన్ని ఇళ్ళు నిర్మాణ దశలో ఉన్నాయి.
కానీ ఇప్పటివరకు వాటిని లబ్దిదారులకు అందజేయలేదు. అలాగే నిర్మాణ దశలో ఉన్న ఇళ్లని పూర్తి చేసే కార్యక్రమం చేయడం లేదు. అయితే ఆ ఇళ్ళు మాత్రం తామే కట్టించామని జగన్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుంది. అలాగే టిడ్కోకు సంబంధించి ఒక ఛైర్మన్‌ని కూడా నియమించారు. ఇలా గత చంద్రబాబు ప్రభుత్వంలో నిర్మించిన ఇళ్లని తన ఖాతాలో వేసుకోవడానికి జగన్ ప్రభుత్వం గట్టిగానే ప్రయత్నిస్తుంది. పైగా ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన సెంటు, సెంటున్నర స్థలంలో ఎలాంటి ఇళ్ళు కట్టుకోవచ్చు కూడా అందరికీ తెలుసు. మొత్తానికి బాబు ఘనతని తనదే అని చెప్పుకోవడంలో జగన్ బాగా ఆరాటపడుతున్నారని తెలుస్తోంది
Discussion about this post