తెలంగాణ పీసీసీ అధ్యక్షుడుగా రేవంత్ ఎంపికైన దగ్గర నుంచి పలువురు రాజకీయ నాయకులు ఆయనకు వ్యతిరేకంగా ఆరోపణలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. అసలు రేవంత్‌కు పీసీసీ ఇప్పించింది చంద్రబాబే అని అంటున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ రాజకీయాలుతో సంబంధం లేని ఏపీకి చెందిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి , రేవంత్‌కు పీసీసీ ఇవ్వడంపై ఆరోపణలు చేస్తున్నారు. ఢిల్లీలోని కాంగ్రెస్ అధిష్టానాన్ని కొనేసి చంద్రబాబు, రేవంత్‌కు పీసీసీ ఇప్పించారని అని ఆరోపణలు చేస్తున్నారు. రేవంత్ బాబు మనిషి అని అంటున్నారు.
ఈ క్రమంలోనే విజయసాయి ఆరోపణలని రేవంత్ అసలు పట్టించుకోవడం లేదు. ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయసాయి తిక్కలోడు అని, ఆయన మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని మాట్లాడారు. అంటే ఢిల్లీలోని కాంగ్రెస్ అధిష్టానంతో మాట్లాడి తనకు చంద్రబాబు పీసీసీ ఇప్పించారంటే, ఆయన బలవంతుడు అని విజయసాయి ఒప్పుకున్నట్లేనా అని రివర్స్‌లో కౌంటర్లు ఇచ్చారు. అంటే చంద్రబాబుపై ఎప్పుడు లేనిపోని విమర్శలు చేసే విజయసాయికి రేవంత్ ఘాటుగానే సమాధానం చెప్పారు.కాకపోతే చంద్రబాబు అంటే కోపం ఉన్న విజయసాయి, రేవంత్‌ని టార్గెట్ చేయడం వల్ల ప్రయోజనం ఎవరికి ఉంటుందని విశ్లేషకులు ఆలోచిస్తున్నారు. అంటే రేవంత్ వెనుక చంద్రబాబు ఉన్నారని చెబితే, తెలంగాణలో కాంగ్రెస్‌కు నష్టం వస్తుందని, ఆటోమేటిక్‌గా అది కేసీఆర్‌కు లబ్ది చేకూరుతుందనేది విజయసాయి ప్లాన్ అయి ఉంటుందని అంటున్నారు. కానీ ఏపీలో అధికారంలో ఉన్నారు కాబట్టి విజయసాయి మాటలు చెల్లుబాటు అవుతున్నాయని, ఆ మాటలు తెలంగాణలో వర్కౌట్ కావని చెబుతున్నారు.
నీటి విషయంలో జగన్, వైఎస్సార్‌లని తెలంగాణ మంత్రులు తిడుతుంటే, ఆ విషయంపై విజయసాయి స్పందించకుండా రేవంత్ వెనుక బాబు ఉన్నారని పనికిమాలిన రాజకీయాలు చేస్తున్నారని కాంగ్రెస్ శ్రేణులు మండిపడుతున్నాయి. ఏదేమైనా తెలంగాణలో విజయసాయి చెత్త వ్యూహాలు వర్కౌట్ అవ్వవని అంటున్నారు.
Discussion about this post