చింతమనేని ప్రభాకర్…ప్రతిపక్ష టీడీపీలో ఉన్న ఫైర్ బ్రాండ్ నాయకుడు. దెందులూరు నియోజకవర్గంలో బలమైన నాయకుడు. అలాంటి బలమైన నాయకుడుని గతంలో వైసీపీ ఎన్ని రకాలుగా నెగిటివ్ చేయాలో, అన్నీ రకాలుగా నెగిటివ్ చేసింది. గతంలో దెందులూరు ఎమ్మెల్యేగా ఉన్న చింతమనేనిపై పలు రకాలుగా బురదజల్లే కార్యక్రమం చేశారు. సాధారణంగా చింతమనేనికి దూకుడు ఎక్కువ ఆ దూకుడు వల్ల కొన్ని వివాదాల్లో కూడా చిక్కుకున్నారు.

ఇక ఆ వివాదాలని పెద్దగా చేసి నిత్యం చింతమనేనిపై ఓ రేంజ్‌లో వైసీపీ విష ప్రచారం చేస్తూ వచ్చింది. దాని వల్ల ఆయన నియోజకవర్గ ప్రజలకు చేసిన సేవలని పైకి రానివ్వకుండా వివాదాలని హైలైట్ చేసి చింతమనేనికి బాగా నెగిటివ్ తెచ్చారు. ఆ నెగిటివ్ కారణంగానే 2019 ఎన్నికల్లో చింతమనేని ఓటమి పాలయ్యారు. ఓడిపోయాక కూడా చింతమనేనిని వైసీపీ టార్గెట్ చేస్తూనే వస్తుంది. అడుగడుగున ఆయన్ని ఇబ్బంది పెట్టడానికే చూస్తూ వచ్చింది.

ఇప్పటికే ఆయనపై బోలెడు కేసులు పెట్టారు…అలాగే పలుమార్లు జైలుకు కూడా పంపారు. పైగా చింతమనేని ఏమన్నా ప్రజా సమస్యలపై పోరాటం చేయడానికి సిద్ధమైతే చాలు పోలీసులు అడ్డుకుంటున్నారు. తాజాగా పెట్రోల్, డీజిల్ రేట్ల పెంపుపై ఆందోళన కార్యక్రమం చేసిన చింతమనేనిని పోలీసులు అడ్డుకున్నారు. ఇలా వైసీపీ పూర్తిగా చింతమనేనిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నట్లు కనిపిస్తోంది. ఇప్పుడు ఇదే చింతమనేనికి బాగా ప్లస్ అవుతుంది.

వైసీపీ చేసే చర్యలే చింతమనేనికి బాగా ప్లస్ అవుతున్నాయి. అందుకే నియోజకవర్గంలో కూడా చింతమనేని ఊహించని విధంగా పుంజుకున్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా, చింతమనేని భారీ మెజారిటీతో గెలిచే స్థాయికి వచ్చేశారు. అంటే గతంలో ఎమ్మెల్యేగా ఉన్న చింతమనేనిని గట్టిగా టార్గెట్ చేసి నెగిటివ్ చేసిన వైసీపీ…ఇప్పుడు ఓడిపోయిన ఉన్న చింతమనేనిని మళ్ళీ టార్గెట్ చేస్తూ ప్లస్ అవుతుంది.

Discussion about this post