పేదలకు ఉచితంగా ఇళ్ల స్థలాలు ఇచ్చి, అందులో ఇళ్ళు కట్టించే కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం మొదలుపెట్టిన విషయం తెలిసిందే. జగనన్న కాలనీల పేరిట దాదాపు 30 లక్షల ఇళ్ల వరకు కట్టించి ఇస్తున్నామని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఇక మొదటి దశలో భాగంగా తాజాగా పలు నియోజకవర్గాల్లో జగనన్న కాలనీఏలకు ఎమ్మెల్యేలు, మంత్రులు శంఖుస్థాపనలు చేశారు. ఇక జగన్ పేదలకు ఉచితంగా ఇళ్ళు కట్టించి ఇవ్వడాన్ని చూసి టీడీపీ నేతలు ఓర్వలేకపోతున్నారని వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా జగనన్న కాలనీల నిర్మాణం చేపడుతున్నామని, ప్రతి లబ్ధిదారుడు ఆనందపడేలా నివాస గృహాలు ఉంటాయని, జగనన్న కాలనీల్లో మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నామని చెబుతున్నారు.
ఇక వైసీపీ నేతలు చెప్పే మాటలు నిజమే అని టీడీపీ నేతలు అంటున్నారు. కాకపోతే ఇందులో కొన్ని లాజిక్‌లు ఉన్నాయని చెబుతున్నారు. నిజంగానే జగనన్న కాలనీలు మాదిరిగా దేశంలో ఎక్కడా సెంటు, సెంటున్నర భూముల్లో ఎక్కడా ఇళ్ళు కట్టించి ఇవ్వలేదని చెబుతున్నారు. అసలు వైసీపీకి చెందిన కొందరు నేతలే ఈ సెంటు భూముల్లో కట్టే ఇళ్ళు ఎక్కడా సరిపోతాయని ప్రశ్నిస్తున్నారు, కనీసం కొత్తగా పెళ్ళైన వారు శోభనం చేసుకోవడానికి కూడా సరిపోదని అంటున్నారని టీడీపీ శ్రేణులు గుర్తు చేస్తున్నారు. అలాగే తాము డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు కట్టించు ఇస్తుంటే, జగన్ ఒక రూమ్ కట్టేసి ఇది ఇళ్ళు అంటున్నారని పక్క రాష్ట్ర మంత్రులు మాట్లాడుకునే స్టేజ్‌లో జగనన్న కాలనీలు ఉన్నాయని చెబుతున్నారు.
ఇక కేంద్రం ఇచ్చే డబ్బులతో ఇళ్ళు కడుతూ తామే మొత్తం కట్టించేస్తున్నామని బిల్డప్ ఇవ్వడం వైసీపీ నేతలకే సాధ్యమని, ఇక థర్మాకోల్ షీట్లపై సిమెంట్ ప్లాస్టింగ్ చేసి ఇళ్ళు కడుతున్న వైసీపీ ప్రభుత్వాన్ని చూసి ప్రజలు ఆనందపడాలో, ఆశ్చర్యపోవాలో అర్ధం కావడం లేదని టీడీపీ శ్రేణులు కౌంటర్లు వేస్తున్నాయి. ఇక మౌలిక సదుపాయాల సంగతి మోదీకే ఎరుక అని అంటున్నారు.
Discussion about this post