సీఎం జగన్ అధికారంలోకి వచ్చి రెండేళ్ళు దాటేసింది. మరి ఈ రెండేళ్లలో రాష్ట్రంలో అభివృద్ధి ఏ స్థాయిలో జరిగింది అంటే….అబ్బో మామూలుగా లేదు..రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతుందని వైసీపీ నేతలు, ఆ పార్టీ అనుకూల మీడియా ఓ రేంజ్‌లో డప్పు కొడుతుందనే చెప్పొచ్చు. సరే వారు చెప్పినట్లు అభివృద్ధి ఎక్కడ జరిగిందా? అని సామాన్య ప్రజలు వెతుక్కుంటే అది కనబడదు. అయితే జగనన్న పాలనలో సరికొత్త అభివృద్ధి మాత్రం జరుగుతుందని ప్రజలు అంటున్నారు.
అది ఏంటంటే రోడ్లని పొలాలుగా మార్చడంలో జగనన్న ప్రభుత్వానికి తిరుగులేదని అంటున్నారు. అదేంటి రోడ్లు, పొలాలుగా ఎలా మారతాయని డౌట్ రావోచ్చు. అది మా జగనన్న గొప్పతనం అంటున్నారు సామాన్య ప్రజలు. జగన్ అధికారం చేపట్టే మూడో ఏడాది మొదలైంది. అంటే ఇప్పుడు వర్షాకాలం మొదలైంది. ఇక వర్షాలకు రోడ్లు ఏ స్థాయిలో దెబ్బ తిన్నాయో ప్రత్యేకంగా చెప్పాలసిన పని లేదు.ఎక్కడకక్కడ గోతులే, గోతులే. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో గోతుల పథకం నడుస్తున్నట్లు కనిపిస్తుంది. ఈ గుంటల వల్ల ప్రమాదాలు కూడా ఎక్కువగానే జరుగుతున్నాయి. అలాగే వాహనాలు పూర్తిగా మునిగి పైకి వచ్చే స్థాయిలో గుంటలు పడ్డాయి. అయితే ఈ గుంతల వల్ల ఆర్‌అండ్‌బీ ఇంజనీరుకు కూడా ఓ అనుభవం ఎదురైంది. గోదావరి జిల్లాకు చెందిన అధికారి బైక్ వేసుకుని వెళ్ళి, గుంతలో పడి గాయాలపాలయ్యారు. దీంతో ఆయన అప్రమత్తమై, తన తోటి అధికారులు జాగ్రత్తగా వెళ్లాలని వాట్సాప్ గ్రూప్‌ల్లో మెసేజ్‌లు పెట్టారు.
ఇక తాజాగా ద్వారపూడి, మండపేట రోడ్డు పరిస్తితి మరీ దారుణంగా ఉంది. అక్కడ స్థానికంగా ఉన్న టీడీపీ ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు వెరైటీగా నిరసన తెలుపుతూ, రోడ్డు మీద ఉన్న గుంతల్లోనే వరి నాట్లు వేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల పరిస్తితి ఇలాగే ఉంది. వర్షాకాలం వస్తుందని ముందు జాగ్రత్తగా రోడ్లు బాగుచేసే కార్యక్రమం కూడా జగన్ ప్రభుత్వం చేయలేదు. ఇలా గుంతలు పడిన వెంటనే మరమ్మత్తులు చేయడం లేదు. ఏదేమైనా జగనన్న గోతుల పథకంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు.
Discussion about this post