ఏపీలో జగన్ ప్రభుత్వానికి ఆదాయం తక్కువ…అప్పులు ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. నెల నెల అప్పులు చేయనిదే ప్రభుత్వం నడపలేని స్థితి ఉంది. అందుకే జగన్ ప్రభుత్వం కొత్తగా రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలుపెట్టిందని విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే ప్రజల మీద అన్నిరకాలుగా పన్నులు భారం వేసి, వారి నుంచి ముక్కుపిండి మరీ డబ్బులు వసూలు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే డబ్బులు రాబట్టడానికి ప్రభుత్వ భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి జగన్ ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. తాజాగా గుంటూరులో విలువైన ప్రభుత్వ భూములని గుర్తించాలని కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ శాఖల వద్ద ఖాళీగా ఉన్న, ఉపయోగించని భూములను గుర్తించి జిల్లా కలెక్టర్ ముందుస్తుగా పొజిషన్ తీసుకొని పురపాలక శాఖకు అప్పగించాలని ఆదేశాలు ఇచ్చారు. అయితే ఇందులో దేవదాయ, ధర్మాదాయ శాఖ, విద్యాశాఖ, విద్యాసంస్థలు, వక్ఫ్, ఇతర అభ్యంతకరమైన భూములని ముట్టుకోవద్దని ఆదేశాలు ఉన్నాయి.ఇక మిగిలిన ప్రభుత్వ భూముల్లో ప్లాట్లు వేసి, జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్ పేరిట తక్కువ ధరకే మధ్య తరగతి కుటుంబాలకు విక్రయించనున్నారని తెలుస్తోంది. కానీ అలాగే పరిస్తితి ఉంటుందా ? ఆ భూముల్లో వైసీపీ నేతలు అక్రమంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయకుండా ఉంటారా? అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. అయిన ప్రభుత్వ భూముల్లో ప్రభుత్వమే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం ఏంటో? అర్ధంకాని పరిస్తితి ఉందని అందరూ ఆశ్చర్యపోతున్నారు.
ఇక వైజాగ్ లో ప్రభుత్వం ఆధీనంలో ఉన్న మిగులు భూములను కూడా ఇలాగే విక్రయించేందుకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఏదేమైనా జగన్ ప్రభుత్వంలో అమ్మడానికి ఏది అనర్హం కాదన్నట్లుగా పరిస్తితి ఉందని విమర్శలు వస్తున్నాయి.
Discussion about this post