March 24, 2023
జగన్‌కు తలనొప్పిగా ఆ ఇద్దరు..గెలుపు ఆపలేరా?
ap news latest AP Politics TDP latest News YCP latest news

జగన్‌కు తలనొప్పిగా ఆ ఇద్దరు..గెలుపు ఆపలేరా?

జగన్ అధికారంలోకి వచ్చాక టి‌డి‌పిని అణిచివేయడానికి ఎన్ని రకాల రాజకీయం చేశారో చెప్పాల్సిన పని లేదు. ఆఖరికి టి‌డి‌పి నుంచి గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలని లాగేసుకున్నారు. మిగిలిన నియోజకవర్గాల్లో టి‌డి‌పిని దెబ్బకొట్టడానికి రకరకాల ఎత్తులు వేస్తూ వచ్చారు. ఆఖరికి టి‌డి‌పి గెలిచిన స్థానాలని దక్కించుకోవడం కోసం ఎన్ని కుట్రలు చేశారో చెప్పాల్సిన పని లేదు. ఎలాగైనా టి‌డి‌పి ఎమ్మెల్యేలని ఓడించాలని వ్యూహాలు వేస్తూ వస్తున్నారు.

కానీ ఎన్ని వ్యూహాలు వేసిన ఫలించడం లేదు.ఇప్పుడు వైసీపీకే రివర్స్ అయింది..వైసీపీ ఎమ్మెల్యేలే మెజారిటీ సంఖ్యలో ఓడిపోనున్నారు. అయితే జగన్ ప్రత్యేకంగా ఓ ఇద్దరు టి‌డి‌పి ఎమ్మెల్యేలపై ఎక్కువ ఫోకస్ చేశారనే చెప్పవచ్చు. చంద్రబాబు కుప్పంతో పాటు..అద్దంకిలో గొట్టిపాటి రవికుమార్‌ని, పర్చూరులో ఏలూరి సాంబశివరావులని ఓడించాలని తెగ ఎత్తులు వేస్తున్నారు. పర్చూరు, అద్దంకిల్లో గెలవడం కోసం జగన్ వేయని వ్యూహాలు లేవు. ఆ రెండు చోట్ల టి‌డి‌పిని దెబ్బకొట్టాలని చూస్తూ వచ్చారు. కానీ అక్కడ ఇద్దరు టి‌డి‌పి ఎమ్మెల్యేలని ఏం చేయలేని పరిస్తితి.

రెండు చోట్ల వైసీపీకి బలమైన అభ్యర్ధులు కనిపించడం లేదు. అద్దంకిలో బాచిన చైతన్య వైసీపీ ఇంచార్జ్ గా ఉన్నారు. ఇటు పర్చూరులో ఆమంచి కృష్ణమోహన్ ని ఇంచార్జ్ గా పెట్టారు. అయితే వీరికి ఏ మాత్రం పట్టు దక్కడం లేదు. ఇటీవల వచ్చిన సర్వేల్లో అద్దంకి, పర్చూరులో మళ్ళీ టి‌డి‌పిదే గెలుపు అని తేలిపోయింది.రెండు చోట్ల టి‌డి‌పి బలంగా ఉంది. అద్దంకిలో గత మూడు ఎన్నికల నుంచి గొట్టిపాటి గెలుస్తూ వస్తున్నారు. ఈ సారి ఎన్నికల్లో ఆయన గెలుపు ఖాయమని తేలిపోయింది. ఇటు పర్చూరులో రెండు ఎన్నికల నుంచి ఏలూరి గెలుస్తూ వస్తున్నారు. మూడోసారి ఏలూరి గెలుపు ఖాయమని తేలింది.