సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే కొన్ని పథకాల్లో కేంద్రం వాటా కూడా ఉంటుందనే సంగతి తెలిసిందే. ఇలా చాలా పథకాల్లో కేంద్రానికి సంబంధించిన వాటా ఉంటుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వాలు తెలివిగా కేంద్రం ఇచ్చేదాన్ని కూడా తమ ఖాతాలోనే వేసుకోవాలని ప్రయత్నిస్తుంటాయి. ఏపీలోని జగన్ ప్రభుత్వం అచ్చంగా ఇలాగే చేస్తుంది. కేంద్రం ఇచ్చే వాటాని కూడా తమ ఖాతాలో వేసుకోవడానికి చూస్తుంది. దీంతో కేంద్ర ప్రభుత్వం జగన్ సర్కార్‌కు షాక్ ఇవ్వడం మొదలుపెట్టింది. రైతుభరోసా, హౌసింగ్ స్కీమ్, ఉచిత రేషన్ ఇలా చెప్పుకుంటూ పోతే పలు పథకాల్లో కేంద్రం వాటా ఉంటుంది.
కానీ అదేమీ కనబడనివ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆ క్రెడిట్ తమ ఖాతాలో వేసుకోవడానికి చూస్తుంది. అందుకే కేంద్ర ప్రభుత్వం రేషన్ విషయంలో రాష్ట్రానికి భారీ షాక్ ఇచ్చింది. కేంద్రం నుంచి వచ్చే రేషన్ కోటాని చౌక దుకాణాల దగ్గరే పంపిణీ చేయాలని ఆదేశించింది. కేంద్రం ఇచ్చే కోటాని కూడా రేషన్ వాహనల్లో సరఫరా చేయడం వల్ల అది రాష్ట్ర ప్రభుత్వమే ఇచ్చిందని తెల్ల రేషన్ కార్డు దారులు భావిస్తున్నారు. అందుకే ఇక నుంచి కేంద్రం ఇచ్చే రేషన్‌ని డీలర్లే ఇవ్వాలని ఆదేశించింది. చౌక దుకాణాల దగ్గర ‘ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన’ ఉచిత రేషన్ బ్యానర్‌లను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తెలివిగా ఆ భారాన్ని డీలర్ల మీదకు తోసే ప్రయత్నం చేస్తుందని తెలుస్తోంది. కేంద్రం ఇస్తున్నట్లు బ్యానర్లు ఏర్పాటు చేయడం, ఇంకా ఇతర ప్రచార కార్యక్రమాలు డీలర్లే చూసుకోవాలని జగన్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. దీంతో రేషన్ డీలర్లు తమ ఖర్చుతో బ్యానర్లు ఏర్పాటు చేయడం ఏంటి అని షాక్ అవుతున్నారు. మొత్తానికైతే తమ వాటా రేషన్‌ని రాష్ట్ర ప్రభుత్వం ఖాతాలో పడకుండా కేంద్రం జగన్‌కు గట్టిగానే షాక్ ఇచ్చింది.
Discussion about this post