ఏపీ రాజకీయాల్లో మీడియా పాత్ర ఎంత ఉందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ప్రతి రాజకీయ పార్టీకి అనుకూలమైన మీడియా వర్గాలు ఉన్నాయి. ముఖ్యంగా అధికార వైసీపీ, ప్రతిపక్ష టిడిపిలకు అనుకూల మీడియా సంస్థలు ఉన్నాయి. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. అంటే టిడిపి అనుకూల మీడియా కాస్త జగన్‌కు యాంటీగా ఉంటుంది. అటు వైసీపీ అనుకూల మీడియా చంద్రబాబుకు యాంటీగా ఉంటుంది.

అయితే టిడిపికి అనుకూలంగా ఉండే మీడియాని యెల్లో మీడియా అని ప్రత్యర్ధులు విమర్శిస్తున్నారు. ఇటు వైసీపీకి అనుకూలంగా ఉండే మీడియాని బ్లూ మీడియా అని అంటారు. వైసీపీ అధికారంలో ఉండటంతో జగన్ ప్రభుత్వం ఏ విధంగా టిడిపిని గానీ, టిడిపి అనుకూల మీడియాగానీ ఇబ్బంది పెడుతుందో అందరికీ తెలిసిందే. కానీ టిడిపి అనుకూల మీడియా జగన్ ప్రభుత్వం చేస్తున్న తప్పులని నిరంతరం ఎత్తిచూపుతూనే ఉంది.

ఇక అదే అంశం అధికార వైసీపీకి చిర్రెత్తుకొచ్చేలా చేస్తోంది. అందుకే వైసీపీ ప్రభుత్వం టిడిపి అనుకూల మీడియా అనుకునే సంస్థల ప్రసారాన్ని ఏపీలో ఆపేశారు. అలాగే ఎక్కడక్కడ ఆ మీడియాపై ఆంక్షలు విధిస్తూ వస్తున్నారు. అయినా సరే ప్రభుత్వ తప్పులని ఆ మీడియా ఎండగడుతూనే ఉంది. దీంతో వైసీపీ నేతలకు ఫ్రష్టేషన్ పెరిగిపోతుంది. ఆఖరికి సిఎం జగన్ సైతం యెల్లో మీడియా మనలని నెగిటివ్ చేస్తుందని మాట్లాడే స్టేజ్‌కు వచ్చేశారు.

అసలు జగన్ ప్రభుత్వం విపరీతంగా అప్పులు చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ అంశాన్ని టిడిపి గానీ, మీడియా సంస్థలు గానీ తప్పుబడుతున్నాయి. అయితే అప్పో, సొప్పో చేసి ప్రజల్ని ఆదుకుంటుంటే, తమని యెల్లో మీడియా నెగిటివ్ చేస్తుందని జగన్ బాధపడుతున్నారు. అసలు పరిమితికి మించి అప్పులు చేసి జనాల నెత్తి మీద భారం వేస్తుందే జగన్ ప్రభుత్వమని టిడిపి శ్రేణులు కౌంటర్లు ఇస్తున్నాయి.

తప్పులు చేస్తున్నారు కాబట్టే నెగిటివ్ అవుతున్నారని, అలాంటప్పుడు వైసీపీ అనుకూలమైన బ్లూ మీడియా జగన్‌కు నిత్యం భజన చేస్తుంది కదా…దాని వల్ల జగన్‌కు పాజిటివ్ ఎందుకు రావడం లేదని ప్రశ్నిస్తున్నారు. అంటే బ్లూ మీడియా జగన్‌ని పైకి లేకలేకపోతుందా? అని అడుగుతున్నారు. అంటే సొంత బ్లూ మీడియానే జగన్‌కు దెబ్బవేసేసిందని తమ్ముళ్ళు మాట్లాడుతున్నారు.

Discussion about this post