రాజకీయాల్లో విధానపరమైన అంశాల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య విభేదాలు ఉండొచ్చు. కానీ వ్యక్తిగతంగా అధికార పక్షం…ప్రతిపక్ష నాయకులని టార్గెట్ చేస్తే, తర్వాత అధికారం మారినప్పుడు, పరిస్తితి కూడా మారుతుంది. ఇప్పుడు ఏపీలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నాయకులని ఎలా ఇబ్బంది పెడుతుందో అంతా చూస్తూనే ఉన్నారు. పోనీ నాయకులు తప్పు చేస్తే కేసులు పెట్టి, శిక్ష విధించడంలో తప్పు లేదు గానీ, లేనిపోని కేసులు పెట్టి ఎలాగైనా టీడీపీ నేతలని జైల్లో పెట్టడమే లక్ష్యంగా వైసీపీ ముందుకెళుతుంది.

ఇప్పటివరకు ఎంతమంది టీడీపీ కార్యక్ర్తలు, నాయకులు మీద వైసీపీ ప్రభుత్వం కేసులు పెట్టిందో, ఎంతమందిని జైల్లో పెట్టిందో కూడా అందరికీ తెలుసు. మరి అడ్డగోలుగా నాయకులని జైల్లో పెట్టుకుంటూ వస్తున్నారు. ముఖ్యంగా ఒక కమ్మ వర్గాన్ని టార్గెట్ చేసి జగన్ ప్రభుత్వం ముందుకెళుతుంది. అయితే ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి, వారు అనుకున్న పనులు జరుగుతున్నాయి. అదే నెక్స్ట్ సీన్ రివర్స్ అయితే, రివేజ్ కూడా రివర్స్ అవుతుంది. అప్పుడు వైసీపీ నేతలకు చుక్కలు కనబడతాయి.

ఇదే విషయాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు పదే పదే చెబుతున్నారు. వైసీపీ ఎల్లకాలం అధికారంలో ఉండదు. నెక్స్ట్ తాము అధికారంలోకి రాగానే వడ్డీతో సహ తిరిగి చెల్లిస్తామని అంటున్నారు. అంటే నెక్స్ట్ పరిస్తితి ఎలా ఉంటుందో చెప్పాల్సిన పని లేదు. ఇదే అంశాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెబుతూ, జగన్‌ని అలెర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు రాజకీయ నాయకులు వచ్చి ఒక కులం మీద కక్ష సాధిస్తే, తర్వాత వచ్చే వారు మరో కులం మీద కక్ష సాధిస్తారన్నారు. అంటే నెక్స్ట్ సీన్ ఎలా ఉంటుందో పవన్ చెబుతున్నారు. ఇక దీని బట్టి చూస్తే వైసీపీపై టీడీపీ కమ్మని రివెంజ్ తీర్చుకోవడం ఖాయమనే తెలుస్తోంది.

Discussion about this post