గత రెండేళ్లలో ఆరు లక్షల పైనే ఉద్యోగాలు ఇచ్చామని, భవిష్యత్‌లో పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు ఇస్తామని వైసీపీ ప్రభుత్వం చెబుతున్న విషయం తెలిసిందే. అలాగే ఇటీవల పది వేల ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ విడుదల చేశారు. ఇక ఇక్కడ నుంచే అసలు విషయం మొదలైంది. 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని జగన్ ప్రభుత్వం గొప్పగానే చెప్పుకుంటుంది. కానీ ఆ ఉద్యోగాలు వాలంటీర్లు, గ్రామ సచివాలయాల ఉద్యోగాలు, ఆర్టీసీ వాళ్ళని ప్రభుత్వంలోకి తీసుకుని, వారికి తామే ఉద్యోగాలు ఇచ్చేశామని ప్రభుత్వం చెబుతుంది. ఈ విధంగా ఆరు లక్షల ఉద్యోగాలు ఇచ్చామని ప్రభుత్వం చేసే ప్రకటనని ఎవరూ నమ్మట్లేదు.
ఇక కేవలం పది వేల ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడంపై రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు స్వచ్చందంగా ఉద్యమిస్తున్నారు. ఈ క్యాలెండర్ రద్దు చేసి, జగన్ ఎన్నికల ముందు చెప్పినట్లుగా రెండు లక్షల పైనే ప్రభుత్వ ఉద్యోగాలతో సరికొత్త క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నిరుద్యోగులకు ప్రతిపక్ష టీడీపీ కూడా తోడైంది. నారా లోకేష్ నిరుద్యోగులకు అండగా నిలబడుతున్నారు.అలాగే రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగుల చేస్తున్న ఆందోళనకు టీడీపీకి అండగా నిలబడింది. తాజాగా నిరుద్యోగులు సీఎం జగన్ ఇల్లుని ముట్టడించే కార్యక్రమం చేశారు. అయితే పోలీసులు, నిరుద్యోగులని ఎక్కడకక్కడ అరెస్టులు చేశారు. ఈ క్రమంలోనే పోలీసుల చర్యలని టీడీపీ అధినేత చంద్రబాబు ఖండిస్తూ, జాబ్ రావాలంటే జగన్ పోవాలనే నినాదం అందుకున్నారు.
అటు జనసేన అధినేత పవన్ కల్యాణ్ సైతం నిరుద్యోగులకు అండగా నిలబడే కార్యక్రమం చేస్తున్నారు. జగన్‌ని నమ్మి 30 లక్షల మంది నిరుద్యోగులు ఓట్లు వేశారని, ఇప్పుడు పది వేల ఉద్యోగాలు ఇస్తూ, వారిని మోసం చేశారని అంటున్నారు. ఇలా అన్నీ రకాలుగా జగన్ ప్రభుత్వాన్ని రౌండప్ చేసేశారు. ఇక ఏ నిరుద్యోగుల సపోర్ట్‌తో జగన్ గెలిచారో, వారే తర్వాత జగన్‌ని అధికారంలో నుంచి దించేలా కనిపిస్తున్నారు. ఏదేమైనా నెక్స్ట్ ఎన్నికల్లో జగన్‌కు భారీ షాక్ తగిలేలా ఉంది.
Discussion about this post