జగన్ అంటే బాహుబలి కంటే ఎక్కువగానే జనాలు ఊహించుకున్నారు. జగన్ తలచుకుంటే ఏమైనా చేస్తారు అని జనాలు నమ్మారు. జగన్ కి అలాంటి ఇమేజ్ రావడానికి ఒక కారణం ఉంది. ఆయన సోనియాగాంధీని నాడు ఎదిరించారు అన్నది ఒకటి ఉంది. దాని ఫలితంగా జగన్ జైలు పాలు అయ్యారు అని కూడా చెబుతారు. మొత్తానికి యూపీయే సర్కార్ రెండు అధికారంలోకి వచ్చి గట్టిగా ఏడాది కూడా గడవకముందే జగన్ ఎదిరించి దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించారు. అప్పటికి జగన్ రాజకీయంగా కొత్త కావడం, అనుభవం లేకపోవడం వల్లనే అలా జరిగింది తప్ప మరోటి కానే కాదని ఇపుడు అంతా విశ్లేషిస్తున్నారు.
నిజానికి జగన్ ఇపుడు ఎదిరించాల్సింది చాలానే ఉంది. కానీ ఆయన మాత్రం కంప్లీట్ సైలెంట్ గానే ఉంటున్నారు అన్నది జనం భావనగా ఉంది. జగన్ ప్రతిపక్షంలో ఉన్నపుడు ప్రత్యేక హోదా మీద చాలానే చెప్పారు. కానీ ఆయన సీఎం అయి రెండేళ్ళు గడచినా కూడా దాన్ని సాధించలేకపోయారు. మరీ ముఖ్యంగా కేంద్రాన్ని గట్టిగా నిలదీస్తాడు జగన్ అనుకున్న వారికి అంతులేని నిరాశే ఎదురైంది. మోడీ సర్కార్ ని గట్టిగా ఒక్కసారి కూడా ఎపుడూ జగన్ ప్రశ్నించలేకపోవడం ఆయన ఇమేజ్ ని డ్యామేజ్ చేసేదిగానే చూస్తున్నారు.ఇపుడు క్రిష్ణా జలాల సమస్య ఉంది. జగన్ రాయలసీమ ప్రాంతానికి చెందిన వారు. ఓ వైపు కేసీఆర్ సర్కార్ జీవో సైతం జారీ చేసి గత నెల 28వ తేదీ నుంచి నీళ్లను లాగేస్తోంది. దాంతో శ్రీశైలం రిజర్వాయర్ డెడ్ స్టోరేజ్ కి వచ్చేసింది. మరి ఏపీ ప్రయోజనాల కోసం ఎవరినైనా ఎదిరిస్తాను అంటూ నాడు ఎన్నో కబుర్లు చెప్పిన జగన్ ఇపుడు మౌన ముద్ర దాలుస్తున్నారు. నిజానికి జగన్ స్ట్రాటజీ ఏంటో ఎవరికీ అర్ధం కావడం లేదు. ఆయన సోనియా గాంధీని ఎదిరించారు అంటే నాడు ఆయనలో ఉన్న పౌరుషమా లేక రాజకీయ అనుభవ లేమా అన్నది విశ్లేషించుకుంటే రెండవదే నిజం అనిపిస్తుంది.
ఈ పదేళ్ల కాలంలో జగన్ రాజకీయంగా రాటుదేలారు. అందుకే ఆయన తనకేది లాభమో చూసుకుంటున్నారు. తన గురించే ఆలోచించుకుంటున్నారు అన్న విమర్శలు వస్తున్నాయి. మొత్తానికి జగన్ కొండనైనా ఎదిరిస్తారు అన్నది నిన్నటి మాట అని అంతా అనేస్తున్నారు. మరి తన ఇమేజ్ డ్యామేజ్ అయ్యాక రాజకీయంగా జగన్ సాధించేది ఏమైనా ఉంటుందా అన్నదే చూడాలి.
Discussion about this post