ఏపీలో జగన్ ప్రభుత్వానికి క్రియేటివిటీ ఎక్కువైపోయినట్లు కనిపిస్తోంది. రాజకీయంగా నిరుద్యోగులుగా ఉన్నవారికి కొత్త కొత్త పోస్టులని క్రియేట్ చేసి మరీ ఉద్యోగాలు ఇస్తున్నారని టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. ఇప్పటికే బీసీ కులాల పేరిట 56 కార్పొరేషన్లని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఆ కార్పొరేషన్లలో ఒక్క రూపాయి లేదని, వాటి వల్ల ఆయా బీసీ కులాలకు ఎలాంటి న్యాయం కూడా జరగడం లేదని చెబుతున్నారు.
అవే అలా ఉంటే తాజాగా మరో 137 నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసింది జగన్ ప్రభుత్వం. ఇందులో అనేక వింతలు, విడ్డూరాలు కూడా ఉన్నాయి. తమ నాయకులకు రాజకీయంగా ఉద్యోగం కలిపించేందుకే ఈ నామినేటెడ్ పోస్టుల భర్తీ జరిగిందని అర్ధమవుతుంది. పైగా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు న్యాయం చేశామని గొప్పగా చెబుతున్నారు గానీ, అందులో ఒకే వర్గానికి పెద్ద పీఠ వేశారని చెబుతున్నారు.ఇక ఇందులో చాలా పోస్టులు చెల్లనివే ఎక్కువ కనిపిస్తున్నాయని, స్మార్ట్ సిటీలకు నిబంధనలు ఉల్లఘించి పదవులు ఇచ్చారని, అసలు స్మార్ట్ సిటీ జాబితా లేని రాజమండ్రికి సైతం ఛైర్మన్‌ని పెట్టడం జగన్ ప్రభుత్వం గొప్పతనం అని చెబుతున్నారు. అలాగే ఒకే కార్పొరేషన్‌కు ఇద్దరు, ముగ్గురు ఛైర్మన్‌లని ప్రకటించిన ఘనత కూడా జగన్‌దే అంటున్నారు.
ఇందులో ప్రభుత్వం చేసిన మరో వింత ఏంటంటే…ఏలేశ్వరం అని చిన్నవూరుకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి, ఛైర్మన్ పెట్టారు. ఇలా చాలా కార్పొరేషన్లని క్రియేట్ చేసుకుని జగన్ ప్రభుత్వం తమ వారికి పదవులు ఇచ్చుకుంది. అంటే రాజకీయ నిరుద్యోగులుగా ఉన్న తమ నాయకులకు పదవులు ఇవ్వడానికి, ప్రభుత్వం ఈ విధంగా కార్పొరేషన్లు క్రియేట్ చేసి, ఇష్టారాజ్యంగా పదవుల పంపకాలు చేసిందని తమ్ముళ్ళు విమర్శిస్తున్నారు.
Discussion about this post