మంత్రి ధర్మాన ప్రసాదరావు ఈ మధ్య ఏపీ రాజకీయాల్లో సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే విశాఖని రాజధానిగా చేయాలనే డిమాండ్ చేస్తున్నారు. అధికారంలో ఉంటూ అది కూడా మంత్రి పదవి ఉండి కూడా ఉత్తరాంధ్ర వెనుకబడిందని, అందుకే విశాఖని రాజధాని చేస్తే ఉత్తరాంధ్ర బాగుపడుతుందని అంటున్నారు. అయితే గతంలో కావచ్చు..ఇప్పుడు కావచ్చు ధర్మాన మంత్రిగా ఉన్నారు. మరి ఉత్తరాంధ్రకు ఆయన ఏం చేశారు..వెనుకబడకుండా ఏమైనా అభివృద్ధి పనులు చేశారా? అంటే ఏమో అవేమీ ఎవరికీ తెలియదనే చెప్పవచ్చు.

సరే ఆయన డిమాండ్ వచ్చి విశాఖని రాజధానిగా చేయాలని..అలా కుదరని పక్షంలో ఉత్తరాంధ్రని సెపరేట్ గా రాష్ట్రం చేయాలని కొత్త డిమాండ్ తెరపైకి తీసుకొచ్చారు. అప్పుడు సెపరేట్ రాష్ట్రం వస్తే విశాఖని రాజధానిగా చేసుకుంటామని అన్నారు. ఇలా ధర్మాన డిమాండ్‌తో రాయలసీమని ప్రత్యేక రాష్ట్రంగ చేయాలని అక్కడ బీజేపీ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి మరో డిమాండ్ చేశారు. ఇలా ధర్మాన వల్ల మళ్ళీ ప్రాంతాల మధ్య రచ్చ రేగేలా పరిస్తితి వచ్చింది.

ఇదిలా ఉండగానే తాజాగా ధర్మాన మళ్ళీ సరికొత్త వ్యాఖ్యలు చేశారు. పైగా జగన్ నెక్స్ట్ అధికారంలోకి రావడం కష్టమనే తరహాలో పరోక్షంగా నెక్స్ట్ చంద్రబాబు అధికారంలోకి వస్తే అమరావతిని రాజధానిగా కొనసాగిస్తారని, అది తమకు అభ్యంతరం లేదని, కానీ ఉత్తరాంధ్రని ప్రత్యేక రాష్ట్రం చేయాలని డిమాండ్ చేశారు. ఇలా ధర్మాన వ్యాఖ్యలతో వైసీపీలోనే కన్ఫ్యూజన్ మొదలైంది..అసలు ఈయన వైసీపీకి అనుకూలంగా మాట్లాడుతున్నారో లేక ఇరుకున పెట్టాలని మాట్లాడుతున్నారో తెలియకుండా ఉంది.

Leave feedback about this