జగన్ బయటకు ఏమీ మాట్లాడరు, ఆయన మీద విమర్శలు వచ్చినా కూడా సజ్జల లాంటి వారు ఎవరో మీడీయా ఎదుటకు వచ్చి సమాధానం ఇస్తారు. అయితే చాలా డౌట్లు మాత్రం అలాగే ఉండిపోతున్నాయి. కొన్నింటికి క్లారిఫికేషన్ లేక విపక్షాలు చెప్పేది నిజమని కూడా జనాలు నమ్మాల్సి వస్తోంది. ఈ నేపధ్యంలో విపక్షాలు చేసిన విమర్శలు అన్నీ కూడా పచ్చి నిజాలే అని ఒకటికి పది మార్లు ఆ మంత్రి గారు బల్ల గుద్ది మరీ చెబుతున్నారు. దాంతో జగన్ మరింత ఇరకాటంలో పడిపోతున్నారు. ఇంతకీ ఆ మంత్రిగారు ఎవరు అంటే చిత్తూరు జిల్లాకు చెందిన నారాయణస్వామి. ఈయన ఉప ముఖ్యమంత్రి కూడా.
ఈ మధ్య ఆయన తనకు సంబంధం లేని విషయాల గురించి మాట్లాడుతూ హైలెట్ అవుతున్నారు. తన ఎక్సైజ్ శాఖ గురించి మాత్రం ఆయన అసలు పట్టించుకోవడం లేదు అన్న ఆరోపణలు ఉన్నా కూడా బర్నింగ్ టాపిక్స్ మీద మాట్లాడడం ద్వారా మీడియాలో హైలెట్ కావాలనుకుంటున్నారు. ఆయన అలా భావించడం బాగానే ఉన్నా ఆయన చేస్తున్న హాట్ కామెంట్స్ రివర్స్ లో వచ్చి వైసీపీని గట్టిగా తగులుకుంటున్నాయి. ఇంతకీ ఈ మంత్రి గారు అన్న మాటలు చూస్తూంటే ఆంధ్రా తెలంగాణాల మధ్య నీళ్ళ వివాదం అంతా ఉత్తిత్తిదే అన్న అభిప్రాయం కలుగక మానదు.
ఆయన ఇప్పటికి చాలా సార్లు ఒకే మాట చెబుతున్నారు. కేసీయార్, జగన్ ఒక్కటేనని, ఇద్దరి మధ్యనా మంచి రిలేషన్స్ ఉన్నాయని అంటున్నారు. అంతే కాదు కేసీయార్ అంటే జగన్ కి ఎంతో అభిమానమని కూడా నొక్కి వక్కాణిస్తున్నారు. మరి ఈ మాటనే విపక్షాలు కూడా చెబుతున్నాయి. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ దాగుడు మూతలు ఆడుతున్నారని, తమ సొంత రాజకీయం కోసం క్రిష్ణా జలాల వివాదానికి తెర లేపారని కూడా అంటున్నారు. అది నిజమని చెప్పేలా మంత్రి గారి మాటలు ఉన్నాయని అంటున్నారు.
అంతే కాదు, కేసీయార్ జగన్ ల మధ్యన ఉన్న స్నేహాన్ని చెడగొట్టడానికి కొంతమంది చూస్తున్నారని కూడా నారాయణస్వామి అంటున్నారు. ఎవరు చెడగొడతారు, ఎవరికి ఆ అవసరం ఉందో ఆయనే చెప్పాలి మరి. మరో వైపు రాష్ట్ర ప్రయోజనాలకు సైతం ఫణంగా పెట్టేలా వీరిద్దరి స్నేహం ఉంటుందా అన్నది కూడా ఆయనే క్లారిటీ ఇస్తే బాగుంటుంది అంటున్నారు. దీంతో నారాయణస్వామి కామెంట్స్ కాదు కాని జగన్ని అడ్డంగా బుక్ చేసేశారు అన్న టాక్ అయితే వినిపిస్తోంది.
Discussion about this post