ఏ రాజకీయ నాయకుడైన అధినేతలకు ఎంత భజన చేస్తే…అంత బెనిఫిట్ ఉంటుందని చెప్పొచ్చు. సమయానికి తగ్గట్టుగా అధినేతలపై పొగడ్తల వర్షం కురిపిస్తే ఏదొక పదవి వస్తుందనే ఆశలో నాయకులు ఉంటారు. ఇప్పుడు మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు పరిస్తితి కూడా అంతే. టీడీపీలో ఉన్నప్పుడు ఈయనకు చంద్రబాబు ఎంత ప్రాధాన్యత ఇచ్చారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మంత్రి పదవి ఇచ్చి గౌరవించారు.

అలా మంత్రిగా పనిచేసిన నాయకుడు ఇప్పుడు వైసీపీలో, చిన్నపదవి కోసం జగన్‌కు భజన చేసే పరిస్తితికి వచ్చినట్లు కనబడుతోంది. వైసీపీ అధికారంలోకి వచ్చాక శిద్ధా రాఘవరావు, తన తనయుడు సుధీర్‌ని తీసుకుని వైసీపీలోకి వచ్చేశారు. అయితే వైసీపీలోకి వచ్చాక వీరికి ఎలాంటి పదవి రాలేదు. పైగా టీడీపీలో ఉన్నప్పుడు బాగా హైలైట్ అయ్యేవారు. కానీ ఇప్పుడు కంటికే కనిపించడం లేదు.

అందుకే తాడేపల్లి వైసీపీ ఆఫీసుకు వచ్చి మరీ శిద్ధా…జగన్‌కు భజన చేయడం మొదలుపెట్టారు. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే అభివృద్ధి, సంక్షేమంలో మన రాష్ట్రం ముందంజలోఉందని, అసలు జగన్ కొత్త పథకం ఎప్పుడు ఇస్తారని, దేశంలోని మిగతా రాష్ట్ర సీఎంలు ఎదురుచూస్తున్నారని అన్నారు. ఇక అంతటితో ఆగకుండా, పొట్టి శ్రీరాములు త్యాగానికి గుర్తుగా నవంబర్ 1న జరిగే ఆంధ్రప్రదేశ్ అవతరణ వేడుకలని చంద్రబాబు పట్టించుకోలేదని, కానీ ఆ పొరపాటుని జగన్ సరిదిద్ది, ఆర్యవైశ్యుల ఆత్మగౌరవం కాపాడుతున్నారని మాట్లాడారు.

అయితే శిద్ధా ఏ రేంజ్‌లో భజన చేస్తారో బాగా అర్ధమైపోతుంది. తనకు ఏదొక పదవి ఇస్తారేమో అని శిద్ధా ఇలా కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. గతంలో చంద్రబాబు మాత్రం శిద్ధాకు మంచి గుర్తింపే ఇచ్చారు. కానీ ఇప్పుడు పార్టీ మారి ఆయనపైనే విమర్శలు చేస్తున్నారు. ఏదేమైనా శిద్ధాకు జగన్ త్వరగా పదవి ఇస్తే బెటర్ ఏమో, లేదంటే ఈ భజన చూడలేం అని తెలుగు తమ్ముళ్ళు కౌంటర్లు ఇస్తున్నారు.
Discussion about this post