జగన్ సర్కార్ అధికారంలోకి రావడానికి ప్రభుత్వ ఉద్యోగులు తమ వంతుగా కీలకమైన పాత్ర పోషించారు అని చెప్పకతప్పదు. జగన్ వారికి అలవి కానీ హామీలు ఇచ్చి మభ్యపెట్టి అధికారంలోకి ఎలాగోలా రావాలని చూశారు. మొత్తానికి జగన్ ముఖ్యమంత్రి కుర్చీ ఎక్కేశారు. మాట తప్పను, మడమ తిప్పనూ అని తరచూ చెప్పే జగన్ ఉద్యోగ వర్గాల విషయంలో మాత్రం అన్నీ తప్పేశారు రెండేళ్ళుగా జగన్ సర్కార్ అనుసరిస్తున్న విధనాల మీద ఉద్యోగ వర్గాలు గుర్రుమీద ఉన్నాయి. తమ పట్ల సానుకూలంగా ఉంటాడని భావించిన వారి ఆశలు అడియాశలు అయ్యాయి. జగన్ పోకడలు చూస్తున్న ఉద్యోగ వర్గం ఇక మీదట ఉద్యమించడానికి రెడీ అవుతోందిట.
ఇక జగన్ తాను చెప్పిన దానికి కట్టుబడి ఉంటానని, తాను చేయలేని పనులు అసలు హామీ ఇవ్వనని తరచూ చెబుతూంటారు. కానీ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ని రద్దు చేసి పాత పెన్షన్ స్కీం ని అమలు చేస్తామని జగన్ ఎలా చెప్పగలిగారు అంటున్నారు. తాను సీఎం అయిన వారం లోగా ఆ హామీని నెరవేరుస్తానని చెప్పిన జగన్ రెండేళ్ళు అయినా ఆ ఊసు తలవడం లేదు అన్నది ఉద్యోగ వర్గం మండిపాటుకు కారణంగా ఉంది. అంతే కాదు ఎలాంటి కాలయాపన లేకుండా, కమిటీలు లేకుండా ఉద్యోగ వర్గానికి సీపీఎస్ రద్దు చేస్తామని జగన్ పక్కా హామీ ఇచ్చేశారు.మరి ఇపుడు దాని మీద పెదవి విప్పకపోవడమేంటి అని వారంతా ఆగ్రహిస్తున్నారు. పైగా కమిటీల మీద కమిటీలనే వేస్తున్నారు అని ఆరోపిస్తున్నారు. మరి తాను చేయలేను అని నాడే ఎందుకు చెప్పలేదు అన్నదే వేతన జీవుల మనో వేదన. అంటే అధికారంలోకి రావడానికి జగన్ ఇలా అలవి కాని హామీలు ఇచ్చారని అర్ధమవుతోంది అంటున్నారు. మరో వైపు చూస్తే 11వ పీఆర్సీని జగన్ అసలు అమలు చేయడంలేదు. దాన్ని కనుక అమలు చేస్తే కేవలం ప్రభుత్వ ఉద్యోగులకే కాదు, రిటైర్ అయిన పెన్షనర్లకు కూడా ఎంతో ఉపయోగంగా ఉంటుంది. ఇపుడు అన్ని రకాలుగా ఆర్ధిక ఇబ్బందులలో ఉన్న వారంతా పీఆర్సీ మీద ఆశలు పెట్టుకున్నారు.
తెలంగాణాలో అమలు చేయడంతో అక్కడ జీతాలు బాగా పెరిగాయి. ఏపీలో మాత్రం తాను ఉద్యోగుల పక్షమని కబుర్లు చెప్పే జగన్ ఆ సంగతి ఎందుకు మరచిపోయారని వారు గద్దిస్తున్నారు. మొత్తానికి జగన్ సర్కార్ ఇపుడు ఎవరితో పెట్టుకోవాలో వారితోనే పెట్టుకుంది అంటున్నారు. రేపటి రోజున కచ్చితంగా ఉద్యోగ వర్గం జగన్ కి వ్యతిరేకంగా పనిచేయడం ఖాయం. వారితో పెట్టుకున్న ఫలితంగా పరాహవం అనుభవించడం ఖాయమని విశ్లేషణలు ఉన్నాయి. మొత్తానికి జగన్ మాట తప్పాడని ఉద్యోగులు అంటున్నారు అంటే నిజమే కదా అంటున్నారు.
Discussion about this post